
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులు Pushpa 2 The Rule కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈచిత్రం కాస్తా ఆలస్యమైంది. అయినప్పటికీ మేకర్స్ మాత్రం ఈ మూవీ రిలీజ్ డేట్ ను ముందే అనౌన్స్ చేశారు. 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ప్రకటించారు. దీంతో ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి డిమాండ్ ఉంది. ఆ అంచనాలను రీచ్ అయ్యేలానే ప్రమోషన్స్ కూడా ఉంటున్నాయి.
అయితే అల్లు అర్జున్ కు ‘పుష్ప’లో అసిస్టెంట్ గా నటించిన జగదీశ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేశవ (Keshava) పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రెండ్ పార్ట్ లో కేశవ పాత్రనే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు Pushap 2 The Rule షూటింగ్ కొన్ని నెలల ముందే ప్రారంభమై శరవేగంగా కొనసాగింది. ఇంతలోనే ఓ యువతీ ఆత్మహత్య కేసులో జగదీష్ అరెస్ట్ కావడం ఆందోళనకరంగా మారింది. మూవీ షూటింగ్ కు కూడా బ్రేక్ లు పడ్డాయి. ఇప్పటికీ జగదీశ్ ఆ కేసునుంచి బయటపడలేదు. దీంతో సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇటీవల మాత్రం Pushpa 2 Movie రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ చాలా రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆలస్యం అయిన పార్ట్ 2 మళ్లీ జగదీశ్ వల్ల పోస్ట్ అవుతుందనడంతో ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈరోజు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ Sukumar పుట్టిన రోజు కావడంతో స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ‘పుష్ప2’ రిలీజ్ డేట్ ను మరోసారి కన్ఫమ్ చేశారు. 2024 ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుందని ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తున్న విషయం తెలిసిందే. సునీల్, అనసూయ భరద్వాజ్, జగపతి బాబు, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.