Allu Arjun pays homage to Puneeth : పునిత్ ఫోటోను ఆప్యాయంగా తాకిన అల్లు అర్జున్..

Published : Feb 03, 2022, 05:09 PM IST
Allu Arjun pays homage to Puneeth : పునిత్ ఫోటోను ఆప్యాయంగా తాకిన అల్లు అర్జున్..

సారాంశం

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ (Punith Raj Kumar)  కు నివాళి అర్పించారు. స్పెషల్ గా బెంగళూర్ వెళ్లిన బన్ని.. నేరుగా పునిత్ ఇంటికి వెళ్లారు.

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్ కుమార్ (Punith Raj Kumar)  కు నివాళి అర్పించారు. స్పెషల్ గా బెంగళూర్ వెళ్లిన బన్ని.. నేరుగా పునిత్ ఇంటికి వెళ్లారు.

కన్నడ పవర్  స్టార్  పునీత్ రాజ్ కుమార్ (Punith Raj Kumar)  చాలా చిన్న వయసులోనే సడెన్ గా మరణించారు. ఈమధ్యే ఆయనకు గుండె పోటు రావడంతో హాస్పిట్ కు వెళ్లే లోప మరణించారు.  దేశ వ్యాప్తంగా సంచలనం సృస్టించిన పునిత్ మరణానికి అటు సినీ పరిశ్రమే కాకుండా, కోట్లాది  అభిమానులను కంటతడి పెట్టించింది. అక్టోబర్ 29న మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్ (Punith Raj Kumar)  కు దేశ  వ్యాప్తంగా సినిమా వారితో పాటు రాజకీయ నాయకులు కూడా నివాళి అర్పించారు.

ఇక  తాజాగా పునీత్ (Punith Raj Kumar)  కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నివాళి అర్పించారు. బెంగళూరుకు స్పెషల్ గా వెళ్లిన ఆయన పునీత్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారిని పరామర్శించారు. పునిత్  (Punith Raj Kumar)  ఫోటోకి నివాళి అర్పిచిన బన్నీ.. ఆయన్ను ఆప్యాయంగా తడిమారు. తన స్నేహితుడి మరణాన్ని తలుచుకుని ఎమోషనల్ అయ్యారు బన్నీ.

పునిత్ రాజ్ కుమార్ (Punith Raj Kumar).. అల్లు అర్జున్ (Allu Arjun) మంచి స్నేహితులు. చాలా సినిమా పంక్షన్స్ లో వీళ్లిద్దరు కలిసి సందడి చేశారు. బన్ని సినిమా కోసం పునిత్.. పునిత్ సినిమా కోసం బన్నీ హెల్ప్ చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంతే కాదు ఫిట్ నెస్ విసయంలో జిమ్ విషయంలో ఒకరికి ఒకరు సలహాలు ఇచ్చిపుచ్చుకునేవారు. అటువంటి తన స్నేహితుడు మరణం అల్లు అర్జున్ (Allu Arjun) నమ్మలేకపోయారు.

బన్నీ వెంట పునిత్ రాజ్ కుమార్ (Punith Raj Kumar) అన్న.. కన్నడ స్టార్ హీర్ శివరాజ్ కుమార్ (Siva Raj Kumar) కూడా ఉన్నారు. శివన్నతో మాట్లాడిన బన్నీ.. పునిత్ రాజ్ కుమర్ భార్య ను కూడా పలకరించారు.. ఓదార్చారు. బన్ని రాకతో చుట్టుపక్కల అంతా సందడిగా మారింది. ఐకాన్ స్టార్.. పవర్ స్టార్ కు నివాళి అర్పించడానికి రావడంతో అటు పునిత్ ఫ్యాన్స్ తో పాటు బన్నీ ప్యాన్స్ కూడా హడావిడి చేశారు.

రీసెంట్ గా పుష్ప సినిమా రిలీజ్ ప్రమోషన్ కోసం బెంగళూరు వెళ్లారు అల్లు అర్జున్ (Allu Arjun). ఈ సందర్భంగా  పునీత్ కుటుంబాన్ని కలుస్తారా..? అంటూ మీడియా ఆయనను ప్రశ్నించింది. దీనికి సమాధానంగా... తాను తన సొంత సినిమా పని మీద వచ్చానని... సినిమా పని మీద వచ్చి అలా కలవడం మర్యాద కాదని బన్నీ చెప్పాడు. తర్వాత తాను వచ్చి పునీత్ (Punith Raj Kumar) కుటుంబాన్ని కలుస్తానని చెప్పాడు. చెప్పినట్టుగానే. ఈరోజు ఆయన స్పెషల్ గా బెంగళూరుకు వెళ్లి పునీత్ కుటుంబాన్ని కలిశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?