ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉన్నారు అల్లు అర్జున్. మెగా అల్లు ఫ్యాన్ వార్ నడుస్తున్న టైమ్ లో బన్నీ కొత్తింటి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
నిజమెంతో తెలియదు కాని..అల్లు అర్జున్ అతిత్వరలోనే తన కొత్తింట్లోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం ఉమ్మడి ఫ్యామిలీగా . అల్లు అరవింద్ తో కలిసి ఉంటున్నారు బన్నీ. ఇక ఆయన జూబ్లీ హిల్స్ లో కొత్త ఇల్లు కట్టుకుంటుంన్నట్టు సమాచారం. ఇక ఆఫీస్ కూడా ఆ ఇంటికి అటాచ్ గానే ఉండబోతోందట. ఆ ఇంటి నుంచే తన కార్యకలాపాలు నడిపించబోతున్నాడట ఐకాన్ స్టార్. ప్రస్తుతం బన్నీ టాక్ ఆఫద్ ది టౌన్ గా గున్నారు.
ఇండస్ట్రీలో మెగా.. అల్లు ఫ్యాన్స్ మధ్య డైరెక్ట్ వార్ నడుస్తోంది. దీనికి తగ్గట్టుగా బన్నీ చేస్తున్న కొన్ని పనులు మెగా ప్యాన్స్ ను రెచ్చగొట్టే విధంగా ఉంటున్నట్టు వారి అభిప్రాయం. కాస్త సర్ధుమణిగింది అనుకున్న టైమ్ కు ఏదో ఒక డైలాగ్ తో బగ్గుమంటుంది సమస్య. రీసెంట్ గా ఓ సినిమా ఈవెంట్ లో బన్నీ చేసిన కామెంట్స్.. నెట్టింట అల్లు అర్జున్ ను ట్రోల్స్ కు గురయ్యేలా చేసింది. తాను ఫ్యాన్స్ వల్లే హీరో అయ్యానని.. చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇక ఈక్రమంలో అల్లు ర్జున్ హీరోగా.. టాలీవుడ్ టాప్ హీరోగా.. మెగా ఇమేజ్ ను మించి సాధించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే తాను ఇల్లు కూడా అందుకు తగ్గట్టుగానే విశాలంగా అద్భుతంగా కట్టుకున్నారట. అయితే ఆ ఇంట్లో లైబ్రరి, స్విమ్మింగ్ పూల్, గేమస్ తో పాటు.. మంచి లాన్, మినీ థియేటర్ కూడా ఉన్నట్టు సమాచారం. దాదాపు 3000 గజాల స్థలంలో ఆయన ఇల్లు కట్టుకుంటున్నారట.
ఇక త్వరలో ఈ ఇంట్లోకి బన్నీ తన ఫ్యామిలీతో పాటు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా నిర్మాణం పూర్తి అయ్యిందని తెలుస్తోంది. తన ఆపీస్ ను కూడా ఈ ఇంటికి ఆనకునే కట్టించుకుంటున్నాడు బన్నీ. ప్రస్తుత ఆయన పుష్ప2 మూవీ సూటింగ్ లో బిజీగా ఉన్నారు. .