బాగా లోతు, డూప్ లేకుండా దూకేసిన నాగార్జున.. చూస్తున్న జనాలకు షాక్, రిక్వస్ట్ చేసినా వినకుండా.. 

By tirumala AN  |  First Published Aug 27, 2024, 1:50 PM IST

క్లాస్, మాస్ చిత్రాలతో పాటు ఆధ్యాత్మిక చిత్రాలతో సైతం మెప్పించిన అరుదైన నటుల్లో కింగ్ నాగార్జున ఒకరు. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలలో తన నటనతో నాగ్ అదరగొట్టారు.


క్లాస్, మాస్ చిత్రాలతో పాటు ఆధ్యాత్మిక చిత్రాలతో సైతం మెప్పించిన అరుదైన నటుల్లో కింగ్ నాగార్జున ఒకరు. అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి చిత్రాలలో తన నటనతో నాగ్ అదరగొట్టారు. అన్నమయ్య రిలీజ్ అయ్యేవరకు నాగ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఎవరూ గుర్తించలేదు. 

ఇక నాగార్జున నటన కోసం రిస్క్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. డైరెక్టర్ విజయ భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో మన్మధుడు చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. నాగార్జునతో సినిమా చేయడం చాలా సులభం. ఆయనతో వర్కింగ్ సరదాగా సాగిపోతుంది. ఆయనకి క్లియర్ గా అన్ని విషయాలు ముందు చెబితే చాలు. ఆ తర్వాత దేనికీ అడ్డు చెప్పరు. 

Latest Videos

క్లైమాక్స్ లో ఊహించని సంఘటన జరిగింది. హీరోయిన్ బోట్ లో వెళుతుంటే నాగార్జున నదిలో దూకి ఆమెని చేరుకోవాలి. నరసాపురంలో ఈ సన్నివేశం షూట్ చేశాం. షూటింగ్ చూసేందుకు భారీగా జనం వచ్చారు. జనాలు చూస్తుండగా నాగార్జున డూప్ లేకుండా నదిలో దూకేశారు. మేమంతా షాక్ అయ్యాం. 

సన్నివేశానికి ముందు డూప్ రెడీగా ఉన్నాడు సార్ అని చెప్పాం. అక్కర్లేదు. నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం నేనే చేస్తాను అని చెప్పారు. ముందుగా ఒక వ్యక్తిని దూకి చెక్ చేయమని చెప్పా. అతడు బాగా లోతు ఉంది అని చెప్పాడు. అయినా నాగార్జున వినలేదు. నాకు డైవింగ్ చేయడం అలవాటే అని నీళ్ళల్లో దూకేసి సక్సెస్ ఫుల్ గా ఆ సీన్ లో నటించారు. 

చుట్టూ చూస్తున్న జనం ఆశ్చర్యపోతూ కేరింతలు కొట్టారు అని డైరెక్టర్ విజయ భాస్కర్ అన్నారు. విజయ భాస్కర్ మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించారు. 

click me!