Latest Videos

ఫ్లాపుల్లో ఉన్న మెగా హీరోని గట్టెక్కించేందుకు మరోసారి ఆ డైరెక్టర్.. మరోసారి క్రేజీ కాంబినేషన్

By tirumala ANFirst Published May 25, 2024, 11:45 AM IST
Highlights

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం తడబాటుకు గురవుతోంది. వరుస డిజాస్టర్స్ తో వరుణ్ తేజ్ మార్కెట్ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం తడబాటుకు గురవుతోంది. వరుస డిజాస్టర్స్ తో వరుణ్ తేజ్ మార్కెట్ ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. గనితో మొదలైన ఫ్లాపుల పరంపర చివరగా విడుదలైన ఆపరేషన్ వాలెంటైన్ వరకు కొనసాగింది. 

గని, ఎఫ్ 3, గాండీవ ధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ ఇలా వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీనితో వరుణ్ తేజ్ ఎలాంటి చిత్రం చేయాలి, ఏ జోనర్ లో చేయాలి అనే సందిగ్ధంలో ఉన్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్.. కరుణ కుమార్ దర్శకత్వంలో మట్కా చిత్రంలో నటిస్తున్నాడు. 

వరుణ్ తేజ్ నటిస్తున్న ఈ మూవీ పూర్తయ్యాక.. ఒక క్రేజీ కాంబినేషన్ కి రంగం సిద్ధం అవుతోంది. ఫిదా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల మరోసారి వరుణ్ తేజ్ తో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఆల్రెడీ శేఖర్ కమ్ముల కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ చర్చలు మొదలయ్యాయట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ హీరోగా కుబేర చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ పూర్తయ్యాక వరుణ్ తేజ్ తో చిత్రం పట్టాలెక్కుతుందట. 

వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభం అయ్యాక మూడు నాలుగు చిత్రాల వరకు హిట్ లేదు. అప్పుడు శేఖర్ కమ్ముల ఫిదా చిత్రంతో వరుణ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు కూడా వరుణ్ తేజ్ కి హిట్ మూవీ అత్యంత అవసరం. ఈసారి కూడా శేఖర్ కమ్ముల మెగా హీరోని గట్టెక్కిస్తాడేమో చూడాలి. 

click me!