Allu Arjun Craze in Korea: కొరియాలో అల్లు అర్జున్ కి మైండ్ బ్లోయింగ్ క్రేజ్..

Published : Feb 11, 2022, 01:26 PM IST
Allu Arjun Craze in Korea: కొరియాలో అల్లు అర్జున్ కి మైండ్ బ్లోయింగ్ క్రేజ్..

సారాంశం

పాన్ ఇండియాకు వెళ్లాలని ఫిక్స్ అయ్యి పుష్ప(Pushpa)ను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్ (Allu Arjun ). కాని పుష్ప క్రేజ్ పాన్ వరల్డ్ లో మారుమోగుతుంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా బన్నీకి ఫ్యాన్స్ తయారయ్యారు.

పాన్ ఇండియాకు వెళ్లాలని ఫిక్స్ అయ్యి పుష్ప(Pushpa)ను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్ (Allu Arjun ). కాని పుష్ప క్రేజ్ పాన్ వరల్డ్ లో మారుమోగుతుంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా బన్నీకి ఫ్యాన్స్ తయారయ్యారు.

పుష్ప(Pushpa)   సినిమా రిలీజ్ అయ్యి రెండు నెలలు అవుతోంది. ఇంకా ఈ సినిమా క్రేజ్ తగ్గలేదు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ చాలా మంది బన్నీ ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ముఖ్యంగా పుష్ప లోని శ్రీవల్లి పాటలో.. బన్నీ(Allu Arjun ) మ్యానరిజాన్ని ఫుల్లుగా ఎక్కించేసుకున్నారు.

ఇప్పటికే మన దేశ వ్యాప్తంగా క్రికెటర్లు.. కామన్ ఆడియన్స్.. తోలుబోమ్మలాట వాళ్లు.. ఆకరికి పొలిటిషియన్స్ కూడా పుష్ప(Pushpa) పాటను ఇమిటేట్ చేస్తూ..బన్ని (Allu Arjun )లా నడుస్తూ.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ క్రేజ్ దేశాలు.. ఖండాలు దాటిపోయింది. ఎక్కడో కోరియాలో ఉన్న ఆడియన్స్ పుష్ప సినిమాకు ఫిదా అయిపోతున్నారు. బన్నీ పెర్ఫామెన్స్ కు సలాం చేస్తున్నారు. అల్లు అర్జున్(Allu Arjun ) ను ఇమిటేట్ చేసి... ఆ వీడియోలను సోషల్ మీడియలో అప్ లోడ్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఓ కొరియన్ లేడీ బన్నీ(Allu Arjun )ని పక్కాగా ఇమిటేట్ చేసింది. శ్రీవల్లి పాటలో బన్నీలా బుజం పైకి ఎత్తుకుని.. పాటకు స్టెప్పులేకసకుంటూ.. మధ్యలో చెప్పును కావాలనే వదిలేసి.. తగ్గేదే లే అంటూ గడ్డం కింద చేయి పెట్టుకుని వీడియో చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. పుష్ప (Pushpa) సినిమాతో పాటు బన్నీ ఇమేజ్ కూడా ఇంటర్నేషనల్ లెవల్లో పెరుగుతోంది.

 

సుకుమార్ డైరెక్షన్ లో  తెరకెక్కిన పుష్ప(Pushpa)   మూవీకి దేవిశ్రీ మ్యూజిక్ పెద్ద ప్లస్ అయ్యింది. ఈ ట్యూన్స్ కు ప్రపంచ వ్యాప్తంగా జనాలు పడిపోతున్నారు. పాటలకు మైమరచి పోతున్నరు. వీటికి తగ్గట్టు బన్నీ పర్ఫామెన్స్ తో అదరగొట్టడంతో.. పుష్ప (Pushpa)  క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. పుష్పలో శ్రీవల్లి పాత్రలో కనిపించిన రష్మిక క్రేజ్ కూడా బాలీవుడ్ లో పెరిగిపోయింది. ఆపర్లు వరుసగా ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం