స్టైలిష్ స్టార్ మల్లు టైటిల్ రెడీ.. మలయాళంలో బిగ్ రిలీజ్

Published : Sep 04, 2019, 11:49 AM IST
స్టైలిష్ స్టార్ మల్లు టైటిల్ రెడీ.. మలయాళంలో బిగ్ రిలీజ్

సారాంశం

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మలయాళంలో ఎలాంటి క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులో రిలీజయిన బన్నీ ప్రతి సినిమా అక్కడ కూడా అదే తరహాలో విడుదలయ్యి మంచి వసూళ్లను అందుకుంటాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మలయాళంలో ఎలాంటి క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. తెలుగులో రిలీజయిన బన్నీ ప్రతి సినిమా అక్కడ కూడా అదే తరహాలో విడుదలయ్యి మంచి వసూళ్లను అందుకుంటాయి. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న కొత్త సినిమాను కూడా కేరళలో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. 

రంగస్థలం - జై లవ కుశ - భాగమతి వంటి సినిమాలను మలయాళంలో డబ్ చేసిన రిలీజ్ చేసిన RD ఇల్ల్యుమినేషన్ సంస్థ అల.. వైకుంఠపురములో డబ్బింగ్ రైట్స్ ను అందుకుంది. అలాగే మల్లు అభిమానులను ఆకర్షించే విధంగా ''అంగు వైకుంతపురతు” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. 

డిసెంబర్ లో సినిమా పనులన్నీటికీ ఎండ్ కార్డ్ వేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇక సినిమాను జనవరిలో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అదే సమయానికి మలయాళంలో కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరి మల్లు స్టార్ అభిమానులు ఈ సినిమాను ఏ స్థాయిలో హిట్ చేస్తారో చూడాలి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?