స్టార్ హీరో ధనుష్ పై నిర్మాతలు ఫైర్!

Published : Sep 04, 2019, 10:40 AM ISTUpdated : Sep 04, 2019, 11:08 AM IST
స్టార్ హీరో ధనుష్ పై నిర్మాతలు ఫైర్!

సారాంశం

చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్.. నటులను కొందరు నిర్మాతలు మోసం చేస్తున్నారని.. వారి నుండి రెమ్యునరేషన్ తీసుకోవడానికి నానాతిప్పలు పడాల్సి వస్తోందని అన్నారు.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలపై నిర్మాతలు మండిపడుతున్నారు. ధనుష్ అలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్.. నటులను కొందరు నిర్మాతలు మోసం చేస్తున్నారని.. వారి నుండి రెమ్యునరేషన్ తీసుకోవడానికి నానాతిప్పలు పడాల్సి వస్తోందని అన్నారు.

దీనిపై స్పందించిన నిర్మాత ఏఎల్ అలగప్పన్.. విజయ్, అజిత్ వంటి అగ్ర నటులు నిర్మాతలకు పూర్తి సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు. కానీ ధనుష్ సహకారం లేని కారణంగా నిర్మాతలు నష్టపోతున్నారని చెప్పారు. కెరీర్ ఆరంభంలో ధనుష్ హీరోగా నటించిన 'తుల్లువదో ఇలమై' నుండి ఇప్పటివరకు చాలా చిత్రాలతో నిర్మాతలు వరుసగా నష్టపోతున్నారని చెప్పారు.

ధనుష్ తో సినిమా తీసిన నిర్మాతలకు లాభాలు వచ్చిన దాఖలాలు లేవని చెప్పారు. వారిలో చాలా మంది సినీ రంగానికే దూరమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత కె.రాజన్ కూడా ఈ విషయంపై స్పందించారు. ధనుష్ తో సినిమాలు తీసిన నిర్మాతలు అప్పుల్లో కూరుకుపోయారని.. హీరో, దర్శకులు చేసే పొరపాట్ల కారణంగా సినిమా నిర్మించడంలో జాప్యం జరుగుతోందని దాని వలన నిర్మాతల అప్పులు పెరిగిపోతున్నాయని చెప్పారు.

పది కోట్లు పెట్టి తీసిన సినిమాను 8 కోట్లకే అమ్మాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. దీని వలన చాలా మంది నిర్మాతలు ఆస్తులు పోగొట్టుకున్నారని గుర్తుచేశారు. వీరితో పాటు మరికొందరు నిర్మాతలు ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో ధనుష్ అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో నిర్మాతలను ఏకిపారేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం