వరుణ్‌ హీరో అయ్యాక కాదు.. చిన్నప్పట్నుంచే అందగాడు.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Published : Apr 02, 2022, 11:36 PM IST
వరుణ్‌ హీరో అయ్యాక కాదు.. చిన్నప్పట్నుంచే అందగాడు.. బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..

సారాంశం

శనివారం వైజాగ్‌లో `గని` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. బన్నీ గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, వైజాగ్‌ పై తన ఇష్టాన్ని వెల్లడించారు.వరుణ్‌తేజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వరుణ్‌ తేజ్‌(Varun Tej) హీరో అయ్యాక అందగాడు అయ్యాడనుకుంటారు. కానీ అది నిజం కాదు. చిన్నప్పట్నుంచే ఆయన చాలా అందగాడు. చిన్నప్పట్నుంచి నేను వరుణ్‌ని చూస్తున్నా. ఎంతో క్యూట్‌గా ఉండేవారు. ఇప్పుడు హీరోగా ఈ స్థాయికి రావడం ఆనందంగా ఉంది అని అల్లు అర్జున్‌(Allu Arjun) అన్నారు. వరుణ్‌ తేజ్‌, సాయి మజ్రేకర్‌ జంటగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం `గని`(Ghani). సునీల్‌ శెట్టి, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించారు. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఏప్రిల్‌ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం వైజాగ్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Ghani Pre Release Event)ని నిర్వహించారు. బన్నీ గెస్ట్ గా పాల్గొన్నారు. 

ఈ ఈవెంట్‌లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ, వైజాగ్‌ పై తన ఇష్టాన్ని వెల్లడించారు. ఇక్కడే తన ఫ్యామిలీ అంతా ఉందని, ఇది తనకు చాలా స్పెషల్‌ రోజు, వైజాగ్‌ తనకు ఎప్పుడూ ప్రత్యేకమే అని తెలిపారు. తమ అల్లు ఫ్యామిలీలో తాతయ్య నిర్మాతగా, నటుడిగా ఉన్నారు, నాన్నగారు నిర్మాతగా రాణిస్తున్నారు. ఇప్పుడు మా జనరేషన్‌లో తమ్ముడు శిరీష్‌ నిర్మాత అవుతాడనుకున్నాం. కానీ హీరో అయ్యాడు. అందుకు చాలా హ్యాపీ. అయితే అన్నయ్య బాబీకి నిర్మాణంపై మంచి పట్టుంది. ఆయన ప్రొడ్యూసర్‌ అవుతే బాగుండు అని చాలా సార్లు అనుకున్నాం. ఇప్పటికి ఎట్టకేలకు అన్నయ్య నిర్మాతగా `గని` చిత్రంతో లాంచ్‌ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 

మరో నిర్మాత సిద్దు ముద్ద మా రిలేటివ్‌. మా ఇంటి అమ్మాయినిచ్చాం. బాబీ, సిద్దు కలిసి మంచి సినిమా చేశారు. ఈ చిత్రం కోసం వరుణ్‌ ఎంతగానో కష్టపడ్డాను. ఆయన కష్టం నేను ప్రత్యక్షంగా చూశాను. అదే సమయంలో ప్రారంభం నుంచి రెగ్యూలర్‌ కమర్షియల్‌ చిత్రాలు కాకుండా చాలా వేరియేషన్‌తో కూడా సినిమాలు, పాత్రలు చేస్తూ తన ప్రత్యేకతని చాటుకుంటున్నాడు. అదే సమయంలో తన స్నేహితులను ఎంకరేజ్‌ చేస్తున్నారు. కొత్త వారిని ఎంకరేజ్‌ చేస్తున్న విధానం నాకు బాగా నచ్చింది. `గని` సినిమా చూశా. అద్భుతంగా ఉంది. మీకు బాగా నచ్చుతుంది అని తెలిపారు బన్నీ. 

ఇక ఫ్యాన్స్ గురించి చెబుతూ, నాకు మీరు ఫ్యాన్స్‌ కాదని, నా ఆర్మీ అని చెప్పడానికి గర్వంగా ఉందని, మీరు నా ప్రాణమని తెలిపారు. ఎవరైనా హీరోలను చూసి అభిమానులు ఇన్‌స్పైర్‌ అవుతుంటారు. మిమ్మల్ని చూసి, మీరు చేసే పనులు చూసి నేను ఇన్‌స్పైర్‌ అవుతుంటాను. అందుకు గర్వంగా ఉంది. ఈ విషయంలో తగ్గేదెలే` అంటూ తనదైన స్టయిల్‌లో చెప్పి ఆకట్టుకున్నారు బన్నీ. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది