బాలకృష్ణ నటిస్తున్న `అఖండ` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ సందడి చేశారు. బాలయ్యపై, ఎన్టీఆర్‌పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు బాలయ్య రిక్వెస్ట్ చేశారు.
బాలకృష్ణ(Balakrishna) నటించిన `అఖండ`(Akhanda Pre Release Event) చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. చాలా రోజుల తర్వాత ఓ పెద్ద ఈవెంట్ జరగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే భారీగా అభిమానులు తరలి వచ్చారు. గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రావడం ఈ ఈవెంట్‌కి మరింత హైప్ వచ్చిందని చెప్పొచ్చు. ఇందులో అల్లు అర్జున్(Allu Arjun).. బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిక్షన్ విషయంలో ఎన్టీఆర్ తర్వాత బాలయ్యకే సాధ్యమైందన్నారు.
Allu Arjun మాట్లాడుతూ, నందమూరి ఫ్యామిలీతో తమకి మొదట్నుంచి మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య మధ్య ఎంతో చనువు ఉండేది. అది ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. బాలయ్య సినిమాలు చూస్తే పెరిగిన నేను ఇప్పుడు `అఖండ` ఈవెంట్‌కి గెస్ట్ గా రావడం ఆనందంగా ఉంది. బాలయ్యలో నాకు నచ్చే విషయం ఒక్కటే.. ఆయనకు సినిమాపై ఉన్న అడిక్షన్, డిక్షన్. డైలాగ్ డిక్షన్‌లో ఆయనకు మరెవ్వరు సాటి రారు. ఎన్టీఆర్ తర్వాత ఆ డిక్షన్ బాలయ్యకే కుదిరింది. రెండు పేజీల డైలాగ్స్ అయినా ఈజీగా చెప్పేస్తారు. బాలయ్యకి ఈ స్థాయిలో అభిమానులు ఎందుకుంటారో 12ఏళ్ల క్రితం ఓ సినిమా ఫంక్షన్ సమయంలో తెలుసుకున్నా` అని చెప్పారు.
బోయపాటి గురించి చెబుతూ, బోయపాటితో `భద్ర` సినిమా చేయాల్సింది. కానీ `ఆర్య` వల్ల దాన్ని వదులుకున్నా. కానీ బోయపాటి దర్శకుడిగా అవడం చూశా, పెద్ద దర్శకుడిగా ఎదగడం చూశా. స్టార్ డైరెక్టర్‌గానూ ఎదగడం చూశాను. మొత్తంగా ఆ జర్నీని చూస్తూ వచ్చాను. ఆయనతో సినిమాలు చేయడంగా ఉంది. మేం కలిసి సినిమాల చేయాలనుకున్నప్పుడు ఆయన ఓ మాట చెప్పేవారు. మంచి సినిమా కాదు బాబు, ఒక మెట్టెక్కే చిత్రం చేయాలనే వారు.
బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో `సింహా` సినిమా వచ్చింది. `లెజెండ్` మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు వస్తోన్న `అఖండ` అన్‌స్టాపబుల్‌గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ సినిమా అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. శ్రీకాంత్ అన్నయ్య ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఆయన్ని ఇలా చూడటం ఫస్ట్ టైమ్. ఎలా ఉంటారో అనుకున్నా. కానీ ఆయన లుక్ అద్భుతంగా ఉంది. ఇకపై కొత్త శ్రీకాంత్ అన్నయ్యని చూస్తాం` అని తెలిపారు బన్నీ.
ఇంకా చెబుతూ, ఒకప్పుడు చిన్న సినిమాలకు కష్టాలుండేవి. ఇప్పుడు పెద్ద సినిమాలకు కష్టాలు వచ్చాయి. కరోనా వల్ల కొన్ని నెలలుగా సినిమాలు వాయిదా వేసుకోవడం నిర్మాతకి ఎంతటి కష్టమో తెలుసు. ఇలాంటి సమయంలో ఇప్పుడు రాబోతున్న ప్రతి సినిమా గెలవాలి. ప్రతి ఒక్కరి సినిమా గెలవాలి. మొత్తంగా సినిమా గెలవాలి. ఇది అందరు కోరుకుంటున్నారు. సెకండ్ వేవ్ తర్వాత వస్తోన్న పెద్ద సినిమా `అఖండ`. ఇది విజయం సాధించింది చిత్ర పరిశ్రమకి వెలుగుని తీసుకురావాలని కోరుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులు గొప్ప వారు. తెలుగు ఆడియెన్స్ సినిమాని ప్రేమించినంతగా మరెవ్వరూ ప్రేమించలేరు` అని చెప్పారు.
ఇందులో Balakrishna మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాలను రిక్వెస్ట్ చేశారు. కరోనా వల్ల సినిమా రంగం ఇబ్బంది పడుతుందని, ఇలాంటి సమయంలో విడుదలవుతున్న సినిమాలకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. నవపూజా విధానాల ప్రత్యేకత ఏంటో, అఖండ అలాంటి చిత్రమన్నారు. డిసెంబర్ 2న విడుదల కాబోతున్న `అఖండ` చిత్రంతోపాటు తమ్ముడు అల్లు అర్జున్`పుష్ప`, రామ్‌చరన్, ఎన్టీఆర్ కలిసి నటించిన రాజమౌళి `ఆర్‌ఆర్‌ఆర్`, చిరంజీవి `ఆచార్య` ఇలా పెద్ద సినిమాలు, అలాగే చిన్న చిత్రాలు కూడా బాగా ఆడాలని తెలిపారు. వాటిని ఆడియెన్స్ ఆదరించాలన్నారు.
నటుడు ఏ పాత్రనైనా చేయాలని, ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలన్నారు. నటుడు ఒక వినియోగదారుడు అన్నారు. శ్రీకాంత్ విలన్ రోల్ చేసిన సందర్భంగా ఆయన్ని అభినందించారు. అదే సమయంలో తాను ప్రేమించేది మొదట ఎన్టీఆర్ అని, ఆయన తనకు తండ్రి, గురువు, దైవంతో సమానమన్నారు. ఆ తర్వాత అభిమానులనే అంతగా ప్రేమిస్తానని చెప్పారు. అయితే వారిని తన స్వలాభాల కోసం వాడుకోనన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏ రోజు తనని గెలిపించాలని అభిమానులను కోరలేదన్నారు. అంతేకాదు త్వరలో తాను ఓ భక్తి చానెల్‌ని ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. అభిమానులకు సరిపడ ప్రాంగణం లేనందున వారికి క్షమాపణలు చెప్పారు బాలయ్య.
also read: Akhanda: బాలయ్య ఒక ఆటంబాంబ్‌ః రాజమౌళి సంచలన వ్యాఖ్యలు.. బన్నీపై నో కామెంట్.. ఫ్యాన్స్ ఫైర్