సన్నీ పక్కా.. సిరి ప్రియుడు రాగానే బిజియంతో మోతెక్కించిన బిగ్ బాస్

pratap reddy   | Asianet News
Published : Nov 27, 2021, 11:05 PM IST
సన్నీ పక్కా.. సిరి ప్రియుడు రాగానే బిజియంతో మోతెక్కించిన బిగ్ బాస్

సారాంశం

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss Telugu 5) చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఫైనల్ చేరుకునేందుకు పోటీపడుతున్నారు. 

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5(Bigg Boss Telugu 5) చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న సభ్యులు ఫైనల్ చేరుకునేందుకు పోటీపడుతున్నారు. నవంబర్ 27 శనివారం ఎపిసోడ్ సరదాగా సాగింది. కింగ్ నాగార్జున శాక్రిఫైస్ గేమ్ ద్వారా ఎపిసోడ్ ని ఆసక్తికరంగా సాగించారు. 

వేదికపైకి హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రేమికులు ఒక్కొకరుగా హాజరయ్యారు. మానస్ తండ్రి, స్నేహితుడు వేదికపైకి వచ్చారు. అలాగే శ్రీరామ్ తల్లి, సోదరి ఎంట్రీ ఇచ్చారు. నేటి ఎపిసోడ్ లో సిరి ప్రియుడు శ్రీహన్ష్ వేదికపైకి రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

శ్రీహాన్ష్ తనకు ఇచ్చిన తొలి గిఫ్ట్ బ్రేస్ లైట్ ని సరికి త్యాగం చేసింది. సిరి త్యాగానికి ఫలితంగా నాగార్జున శ్రీహన్ష్ ని వేదికపైకి ఆహ్వానించారు. శ్రీహన్ష్ ఎంట్రీ ఇవ్వగానే సిరి భావోద్వేగానికి గురైంది. శ్రీహన్ష్ కూడా ఎమోషనల్ అయ్యాడు. వీరిద్దరూ ఎమోషనల్ గా ఉండగా బిగ్ బాస్ అదిరిపోయే బిజియంతో మోతెక్కించారు. 

బ్యాగ్రౌండ్ లో 'పడి పడి లేచే మనసు' బిజియం వస్తుండగా..సిరి, శ్రీహన్ష్ ప్రేమ ఆకట్టుకుంది. ఇక వేదికపైకి వచ్చిన వారంతా టాప్ 5 లోకి వెళ్లే సభ్యులు ఎవరనే విషయాన్ని జోస్యం చెప్పారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ సన్నీ టాప్ 5 లో ఉంటాడని తేల్చేశారు. 

ఇక నామినేషన్స్ నుంచి సన్నీ, సిరి, శ్రీరామ్ సేవ్ అయ్యారు. నాగార్జున మధ్యలో సరదాగా కాజల్ వాయిస్ గురించి సెటైర్ వేశారు. ఇక వేదికపైకి బిగ్ బాస్ 2 కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ దీప్తి సునైనా ఎంట్రీ ఇచ్చింది. దీప్తి సునైనా, షణ్ముఖ్ ఇద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. మొదట షణ్ముఖ్ సోదరుడు వేదికపైకి వచ్చాడు. సోదరులిద్దరి  మధ్య సంభాషణ ఆకట్టుకుంది. దీప్తి సునైనా కూడా షణ్ముఖ్ తో రొమాంటిక్ గా మాట్లాడింది. 

ఇక మానస్ తండ్రి మాట్లాడుతూ.. మానస్, సన్నీ ఇద్దరి స్నేహంపై ఒక సినిమానే తీయొచ్చు అని ప్రశంసించారు. వచ్చిన ప్రతి ఒక్కరూ సన్నీ, శ్రీరామ్ తప్పకుండా తో టాప్ 5 లో ఉంటారని జోస్యం చెప్పారు. 

Also Read: Akhanda : స్టైల్ మార్చి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. అఖండ ప్రీ రిలీజ్ లో రాజమౌళి, బాలయ్య లుక్ కేక

PREV
click me!

Recommended Stories

Allu Sirish Wedding: నయనికతో అల్లు శిరీష్‌ గ్రాండ్‌గా పెళ్లి.. ఆమె బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే.. పెద్ద సౌండ్‌ పార్టీనే
Anticipated Films 2026: మిర్జాపూర్ నుంచి కింగ్ వరకు.. 2026లో రాబోతున్న 5 క్రేజీ సినిమాలు ఇవే!