నాగచైతన్య రిలేషన్ లో ఉన్నారా..? అసలు నిజం వెల్లడించిన అక్కినేని హీరో..

By Mahesh JujjuriFirst Published Nov 30, 2023, 1:11 PM IST
Highlights

అక్కినేని హీరో నాగచైతన్య ప్రేమలో ఉన్నారా.. సహజీవనం చేస్తున్నారా.. ? సమంతతో విడాకులు తరువాత ఎవరితోనో రిలేషన్ మెయింటేన్ చేస్తున్నారా..? ఈ విషయంలో అక్కినేని హీరో  సమాధానం ఏంటీ..? 
 

టాలీవుడ్ జనాలకు ఓ డౌట్ ఉంది.. ప్రస్తుం అక్కినేని హీరో నాగచైతన్య రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ ఏంటి..? అని. ఆయన ఓ హీరోయిన్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని.. సహజీవనం కూడా చేస్తున్నారని.. ఫారెన్ ట్రిప్పులు కూడా వేస్తున్నారని..ఇదిగో సాక్ష్యాలు అంటూ.. వార్తలు తెగ వైరల్అయ్యాయి. ఎవరు ఎన్ని అన్నా..అసలు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెపితే కరెక్ట్ గా ఉంటుంది అంటే డైరెక్ట్ గా చైతూ స్పందిస్తేనే బాగుంటుంది.  ఎందుకంటే ఆయన గురించి ఆయనకు తప్ప ఇంకెవరికి తెలుస్తాయి. అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యే ఫొటోలు, వీడియోలు, వార్తలు చూస్తే చైతు రిలేషన్‌లో ఉన్నాడు అనే అనిపిస్తుంది. 

అందులో ఈమధ్య చైతన్యతో ఎవరో దిగి షేర్‌ చేసిన ఫొటోలో యంగ్ హీరోయిన్ శోభిత ఎక్కువగా వైరల్అయ్యింది. దీంతో రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ గురించి చైతు దగ్గర ఇటీవల ప్రస్తావిస్తే ఆసక్తికర సమాధానం వచ్చింది. నాగచైతన్య – సమంత విడిపోయిన తర్వాత… ఇప్పుడు ఎవరి జీవితాలు వారివి. అయితే విడిపోయిన విషయం, తర్వాత జరిగే చర్చల విషయంలో చాలా రకాల చర్చలు, జరుగుతున్నాయి. 

Latest Videos

ఉదయాన్నే కదిలిన సెలబ్రిటీలు, ఓటు వేసిన మెగాస్టార్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ రాజమౌళి..

ఇక ఇంతకీ ఈ విషయంలో నాగచైతన్య ఏం సమాధానం చెప్పాడంటే..? వ్యక్తిగత జీవితంలో ఏం జరిగినా నేనే స్వయంగా వెల్లడిస్తా. అందులో నాకేం ఇబ్బందేమీ లేదు.. ఎవరి గురించి నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఆగను అన్నారు. అలాగే తన గురించి వచ్చే వదంతుల గురించి కూడా చైతన్య స్పందించాడు. నా గురించి ఎవరేం అనుకున్నా అంటే ఎలాంటి వదంతులు వచ్చినా నేనేం పట్టించుకోను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే ఉంది అని క్లారిటీ ఇచ్చేశాడు. 

కాని తాను రిలేషన్ షిప్ లో లేను అనిమాత్రం చెప్పలేదు నాగచైతన్య.  రిలేషన్‌ గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగే తనకు కుదిరినప్పుడల్లా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను అని మాత్రం వెల్లడించాడు చైతూ. తన ప్లానింగ్ గురించి క్లారిటీ ఇచ్చాడు. అంతే కాదు.. ఎక్కువగా చైతూ.. ప్రయోగాలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.  ఇక చైతన్య సినిమాల విషయానిక వస్తే.. చందు మొండేటి డైరెక్షన్ లో తండేలు సినిమా చేస్తున్నాడు చైతూ. ఈసిిమాతరువాత ఆయన  శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌ గురించి అప్‌డేట్‌ రావొచ్చన్నమాట.

click me!