గొప్ప మనస్సు చాటుకున్న అల్లు అర్జున్.. అభిమాని తండ్రి వైద్యం కోసం బన్నీ ఆర్థిక సాయం

By Asianet News  |  First Published Feb 10, 2023, 4:48 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా గొప్ప మనస్సును చాటుకున్నారు. ఫ్యాన్స్ పట్ల ఎంతో ప్రేమగా ఉండే బన్నీ.. తాజాగా కష్టాల్లో ఉన్న ఓ అభిమాని కుటుంబాన్ని ఆదుకున్నాడు. 
 


టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. కన్నడలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ‘పుష్ప’ చిత్రం తర్వాత బన్నీని అభిమానించే వారు సెపరేట్ ఆర్మీగానే ఏర్పడ్డారు. అల్లు అర్జున్  సినిమా ఈవెంట్లను, సినిమాలను ఫ్యాన్స్ ఎంతలా సక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారో తెలిసిందే. రీసెంట్ ‘వైజాగ్’లో నిర్వహించిన ఫ్యాన్ మీట్ తోనే బన్నీ రేంజ్ ఏంటో అర్థం అవుతుంది.

అయితే అల్లు అర్జున్ ను అంతలా అభిమానించే ఫ్యాన్స్ కష్టాల్లో ఉన్న కూడా ఆదుకుంటున్నారు. తనవంతుగా సాయం అందిస్తున్నారు. ఇలాంటి విషయాలను బన్నీ పెద్దగా ప్రచారం చేసుకోరు. బన్నీకి డైహార్డ్ ఫ్యాన్ అయిన అర్జున్ కుమార్ అనే వ్యక్తికి అండగా నిలిచారు. అతని తండ్రి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ట్రీట్ మెంట్ కు రెండు లక్షలకు పైగా అవసరమైంది. అంత స్థోమతలేకపోవడంతో..  అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విషయాన్ని తెలియజేస్తూ దాతల నుంచి సాయం కోరారు. 

Latest Videos

ఈ విషయం గీతా ఆర్ట్స్ కంటెంట్ హెడ్ శరత్ చంద్ర నాయుడుకు తెలియడంతో బన్నీకి వివరించారు. అయితే, అప్పటికే బన్నీకి అర్జున్ తెలియడంతో వెంటనే వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం భరిస్తానని హామీనిచ్చారు. వెంటనే ఆ డబ్బును కూడా పంపించి అభిమానిని ఆదుకున్నాడు. దీంతో అర్జున్ కుమార్ బన్నీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను గుర్తుపెట్టుకొని మరీ సాయం అందించినందుకు రుణపడి ఉంటానని ట్వీటర్ ద్వారా పేర్కొన్నాడు. బన్నీ సాయం చేయడంతో ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు.

అభిమానులంటే టాలీవుడ్ హీరోలకు ఎంతటి ప్రేమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఈతరం హీరోల వరకూ అందరూ ఫ్యాన్స్ పట్ల ప్రేమగా ఉంటారు. వారిని ఖుషీ చేసేందుకు క్రేజీ ప్రాజెక్ట్స్ ను టేకప్ చేస్తున్నారు. మరోవైపు ఆపదలో ఉన్న ఫ్యాన్స్ నూ ఆదుకున్న ఘటనలు ఉన్నాయి. రీసెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమానిని కలిసి ధైర్యం చెప్పాడు. ఆప్యాయంగా మాట్లాడి మనోబలాన్ని చేకూర్చారు. ఇలా చాలా సందర్భాల్లో తెలుగు స్టార్స్ ఆపదలో ఉన్న అభిమానులను కలుస్తూనే ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప2’లో నటిస్తున్నారు. తాజాగా వైజాగ్ షెడ్యూల్ కూడా పూర్తైంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

Thank you for helping me Annaya my hero ❤️🫶🏻 🤗 I wanted to express my personal gratitude for contributed. anna ❣️ &specially anna 🛐 Thank you for being a great example of leadership to me.🫡 I am forever thankful for this help anna 🤗❤️ pic.twitter.com/eB0fmdvHgV

— ᗩᖇᒎᑌᑎ ᛕᑌᗰᗩᖇ (@ArjunKumar_AAA)
click me!