హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోసారి అల్లు అర్జున్.. డీజే కాంబో రిపీట్ ?

Published : Sep 17, 2022, 06:54 PM ISTUpdated : Sep 17, 2022, 08:06 PM IST
హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోసారి అల్లు అర్జున్.. డీజే కాంబో రిపీట్ ?

సారాంశం

తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక శుభవార్త బయటకి వచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోసారి నటించే అవకాశం ఉందని స్వయంగా అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు.

అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ప్రస్తుతం హరీష్ శంకర్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ;భవదీయుడు భగత్ సింగ్' చిత్రంతో బిజీగా ఉండి ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ ఇతర కమిట్మెంట్స్, పాలిటిక్స్ వల్ల గబ్బర్ సింగ్ డైరెక్టర్ కి సమయం కేటాయించలేకపోతున్నారు. దీనితో హరీష్ మరో సినిమా ప్రయత్నాలో ఉన్నట్లు తెలుస్తోంది. 

తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక శుభవార్త బయటకి వచ్చింది. ఆస్ట్రల్ పైప్స్ సంస్థకి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాడ్ షూట్ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. 

ఈ యాడ్ లో బన్నీ రఫ్ అండ్ టఫ్ గా డిఫెరెంట్ లుక్ లో అదరగొడుతున్నాడు. ఈ యాడ్ విడుదల సందర్భంగా హరీష్ శంకర్ మీడియాతో మాట్లాడారు. అల్లు అర్జున్ తో మూవీ ఎప్పుడు ఉంటుంది అని ప్రశ్నించగా.. త్వరలోనే ఉంటుంది అని హరీష్ శంకర్ బదులిచ్చారు. మేమిద్దరం మరోసారి కలసి పనిచేయడం గురించి ఇప్పుడే అనుకున్నాం. త్వరలో తప్పకుండా సినిమా చేస్తాం అని హరీష్ తెలిపారు.  

ప్రతి దర్శకుడికి అల్లు అర్జున్ ఇష్టమైన నటుడు అని.. అది యాడ్ అయినా, సినిమా అయినా ఎంతో డెడికేషన్ తో వర్క్ చేస్తారు అని హరీష్ ప్రశంసలు కురిపించారు. పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. బన్నీతో మూవీ చేయాలంటే పాన్ ఇండియా సబ్జెక్టు తప్పనిసరి. మరి అలాంటి కథని హరీష్ ఎప్పుడు రెడీ చేస్తారో వెయిట్ చేయాలి. 

ఈ ఆస్ట్రల్ పైప్ యాడ్ విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ లుక్ గురించి మాట్లాడుకుంటున్నారు. యాడ్ చివర్లో బన్నీ పుష్ప తరహాలో ఇక లీకేజే లే అంటూ డైలాగ్ చెబుతున్నాడు. ఆస్ట్రల్ పైప్ బ్రాండ్ తో కలసి పనిచేయడం సంతోషంగా ఉంది అని అల్లు అర్జున్ అన్నారు. అభిమానులు నన్ను ఆదరించినట్లే ఆస్ట్రల్ బ్రాండ్ ని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నట్లు బన్నీ అన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode : సుమిత్రకు తెలిసిపోయిన అసలు నిజం, జ్యోత్స్న కు మొదలైన టెన్షన్..
Illu Illalu Pillalu: నిశ్చితార్థానికి ముందు అపశకునం, కుట్ర మొదలుపెట్టిన శ్రీవల్లి తల్లిదండ్రులు