ఎన్టీఆర్ క్రేజ్ యాడ్ చేస్తే సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట దర్శక,నిర్మాతలు. మరోవైపు ఎన్టీఆర్ సైతం ఎంత బిజీగా ఉన్నా అన్న కోసం రెడీ అన్నారని వినికిడి.
తన ఫ్యామిలీకి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఎన్టీఆర్..తన అన్న కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో వెండితెరపై కళ్యాణ్ రామ్ తన లక్ పరీక్షించుకుంటున్నా చెప్పుకోదగిన హిట్ మాత్రం పడటం లేదు. ఈ నేపథ్యంలో అన్న సినిమాకు ప్లస్ అయ్యేలా ఎన్టీఆర్ ఓ నిర్ణయం తీసుకుంటున్నారట. ఇటీవలే ప్రకటించిన 'బింబిసార' మూవీలో ఎన్టీఆర్ కూడా తన వంతు పార్టనర్ కాబోతున్నారని తెలుస్తోంది.
వశిష్ట మల్లిడి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాల సమాచారం. ఇలా ఎన్టీఆర్ క్రేజ్ యాడ్ చేస్తే సినిమాకు బాగా ప్లస్ అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట దర్శక,నిర్మాతలు. మరోవైపు ఎన్టీఆర్ సైతం ఎంత బిజీగా ఉన్నా అన్న కోసం రెడీ అన్నారని వినికిడి.
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు. ఆయన కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ లో చెప్పింది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వశిష్ఠ్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా ఇతరభాషల్లోను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.