ఇంటర్నెట్ ను షేక్ చేసి పడేస్తున్న ‘పుష్ప ది రూల్’ ఫస్ట్ లుక్.. సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

By Asianet News  |  First Published Apr 9, 2023, 10:57 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ‘పుష్ప 2 : ది రూల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసింది.  
 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తాజాగా రూపుదిద్దుకుంటున్న చిత్రం Pushpa 2 The Rule. 2021లో వచ్చిన ‘పుష్ప : ది రైజ్’కు సీక్వెల్ ఇది. మొదటి భాగంతో ఇండియా వైడ్ గా చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. పుష్ప రాజ్ మేనియా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది. దీంతో సీక్వెల్ ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.  రిలీజ్ ను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.  మరోవైపు ‘పుష్ప2’పైనా తారాస్థాయి అంచనాలు ఉండటంతో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈక్రమంలో అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ‘పుష్ప 2 : ది రూల్’ నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ప్రస్తుతం దారుణంగా వైరల్ అవుతోంది. అన్ని సామాజిక మాధ్యమాల్లో పుష్ప పేరే వినిపిస్తోంది. అయితే నిన్న విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ దక్కుతోంది. ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ అమ్మోరు అవతారంలో దర్శనమివ్వడంతో ఆశ్చర్యపోతున్నారు. ఒక్క పోస్టర్ తోనే సినిమాపైనా మరింతగా అంచనాలు పెరిగాయి. 

Latest Videos

ఇదిలా ఉంటే.. ‘పుష్ప : ది రూల్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు సోషల్ మీడియాలోనే మోస్ట్ లైక్డ్ ఫస్ట్ లుక్ గా నిలిచింది. కేవలం ఒక్కరోజులోనే ట్విటర్ లో 207కే లైక్స్, ఇన్ స్టా గ్రామ్ లో 5 మిలియన్ల లైక్స్, ఫేస్ బుక్ లో 850 కే లైక్స్ వచ్చాయి. ఇంకా కంటిన్యూ అవుతోంది. మరోవైపు ‘పుష్ప ఎక్కడ?’ అంటూ విడుదల చేసిన వీడియో కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఒక్కరోజులోనే 20 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. హిందీలో ఏకంగా 34 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. 

దీంతో పుష్ప2 మున్ముందు అన్నింటా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతుందని అర్థం అవుతోంది. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ స్థాయిలో చిత్రాన్ని ఎక్కడా తగ్గకుండా ప్రమోట్ చేసేందుకు టీమ్ ఫుల్ ప్లాన్డ్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ - రష్మిక మందన్న (Rashmika Mandanna) జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు.  దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 

 

click me!