ఓటీటీలో బన్నీ షో.. అధికారిక ప్రకటన.. ఇంతకి షో ఏంటి?

Published : Mar 15, 2023, 06:52 PM ISTUpdated : Mar 15, 2023, 06:53 PM IST
ఓటీటీలో బన్నీ షో.. అధికారిక ప్రకటన.. ఇంతకి షో ఏంటి?

సారాంశం

అల్లు అర్జున్‌.. ఐకాన్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. పాన్‌ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం `పుష్ప2`లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతున్నారు. ఓ షో చేయబోతున్నారని సమాచారం. 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. ఆయన ఓటీటీలోకి ఎట్రీ ఇవ్వబోతున్నారు. వెండితెరపై రచ్చ చేసే బన్నీ ఇప్పుడు డిజిటల్‌లో సందడి చేసేందుకు వస్తున్నారు.. ఆయన ఓటీటీ మాధ్యమంలో ఓ షో చేయబోతున్నారు. తన సొంత ఓటీటీ సంస్థ అయిన ఆహాలో అల్లు అర్జున్‌ షో చేయబోతుండటం విశేషం. తాజాగా ఆ విషయాన్ని ఆహా ప్రకటించింది. అది నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని ప్రకటించింది. 

`ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ని మీరు మాస్‌ గా, క్లాస్‌ గా చూసి ఉంటారు. ఈ సారి ఒక్క బ్లాక్‌ బస్టర్‌ లుక్‌ తో ఆహా మీ ముందుకి తీసుకురాబోతుంది. బిగ్గెస్ట్ అనౌన్స్ మెంట్‌కి రెడీగా ఉండండి` అని వెల్లడించింది. అయితే.. నిజంగానే బన్నీ ఓటీటీలో షో చేయబోతున్నారా? లేక ఏదైనా షోకి గెస్ట్ గా రాబోతున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఓటీటీలో ఇప్పుడు ప్రధానంగా `అన్‌ స్టాపబుల్‌` షో రన్‌ అవుతుంది. దీంతోపాటు డాన్సు ఐకాన్‌ అనే షో చేస్తున్నారు. మరోవైపు `ఇండియన్‌ ఐడల్‌ 2` చేస్తున్నారు. అలాగే `స్టాండప్‌ కామెడీ షో` రన్‌ అవుతుంది. మరి ఈ షోస్‌లో ఏదో ఒక దానికి గెస్ట్ గా రాబోతున్నారా? కొత్తగా మరేదైనా షో చేయబోతున్నారా? అనే ఆసక్తి నెలకొంది. 

కొందరు `డాన్సు ఐకాన్‌` గెస్ట్ గా వస్తున్నారని అంటున్నారు. కానీ మేజర్‌గా బన్నీతో కొత్త షో చేయబోతున్నారనే టాక్‌ వినిపిస్తుంది. మరి ఏది నిజం అనేది మున్ముందు తేలనుంది. కానీ ఈ ప్రకటన మాత్రం బన్నీ ఫ్యాన్స్ ని ఫుల్‌ ఖుషీ చేస్తుంది. నిజంగానే బన్నీతో ఏదైనా షో ప్లాన్‌ చేస్తే ఆయన్ని తరచూ చూసే అవకాశం ఉంటుంది. అది ఆయన అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. మరి ఏం జరగబోతుందనేది మున్ముందు చూడాలి. 

అల్లు అర్జున్‌ ఇప్పుడు `పుష్ప2`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండేళ్ల క్రితం వచ్చిన `పుష్ప`కి రెండో పార్ట్. ఆ సినిమా పెద్ద విజయం సాధించడంతో రెండో భాగాన్ని గ్రాండియర్‌గా తెరకెక్కిస్తున్నారు సుకుమార్‌. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుంది.మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. అనసూయ,సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో భాగంలో సాయిపల్లవి కీలక పాత్రలో నటించబోతుందని సమాచారం. ఇప్పటికే ఆమె డేట్స్ కూడా ఇచ్చిందని తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్‌.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్‌
Illu Illalu Pillalu Today Episode Dec 18: అమూల్యకు వార్నింగ్ ఇచ్చిన పెద్దోడు, పెళ్లికి సిద్ధమైన విశ్వ