Megastar Chiranjeevi: పెన్నుకు పదును పెట్టిన మెగాస్టార్.. కెమెరా కన్నుకు కూడా పనిచెప్పారు

Published : Jan 30, 2022, 12:28 PM ISTUpdated : Jan 30, 2022, 12:31 PM IST
Megastar Chiranjeevi: పెన్నుకు పదును పెట్టిన మెగాస్టార్..  కెమెరా కన్నుకు కూడా పనిచెప్పారు

సారాంశం

కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. క్వారంటైన్ లో బోర్ కొడుతుందో ఏమో.. పెన్నుకు పదును పెట్టారు చిరు. కెమెరా కన్నకు కూడా పనిచెప్పారు.

కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ప్రస్తుతం ఆయన సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. క్వారంటైన్ లో బోర్ కొడుతుందో ఏమో.. పెన్నుకు పదును పెట్టారు చిరు. కెమెరా కన్నకు కూడా పనిచెప్పారు.

క్వారంటైన్ లో కవిగా మారపోయారు  చిరంజీవి(Megastar Chiranjeevi). కొన్ని రోజుల క్రితం స్వల్ప లక్షణాలతో కరోనా పరిక్షలు చేయించుకున్న మెగాస్టార్.. రిపబ్లిక్ డే రోజు తనకు కరోనా నిర్ధారణ అయ్యిందని ప్రకటించారు. తానుసెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. డాక్టర్ల సలహామేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా బారిన పడక తప్పలేదంటూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) క్యారంటైన్‏లో ఉంటూ వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నారు.. కాగా క్వారంటైన్ లో ఉన్న చిరంజీవి తన పెన్నుకు.. కెమెరాకన్నకు పదును పెట్టారు.తన ఫొటోగ్రఫీ నైపుణ్యాన్నిచూపించారు మెగాస్టార్.  అప్పుడప్పుడే ఉదయించబోతున్న సూర్యుడిని తన కెమెరాలో బంధించాడు. అంతేకాదు దానిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఓ అద్భుతమైన కవిత కూడా రాసి పోస్ట్ చేశారు చిరంజీవి.

సోషల్ మీడియాలో మెగాస్టార్ (Megastar Chiranjeevi) ఏం రాశారంటే.. ఈ రోజు ఉదయం లేవగానే కనిపించిన అందమైన ఆకాశాన్ని కెమెరాలో బంధించి మీతో పంచుకోవాలనిపించింది. ఒక మూలగా వున్న నెలవంక, దగ్గర్లో వున్నశుక్ర గ్రహం ఉదయించబోతున్న సూర్యుడు. ఆ కొంటె సూర్యుడ్ని చూడలేక నెలవంక సిగ్గుతో పక్కకు తొలిగినట్లుగా ఉంది’ అంటూ తను షూట్ చేసిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు చిరు.

 

ఈ పోస్ట్ ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మెగా అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. మీరు సూపర్ సార్.. అద్భుతంగా క్యాప్చర్ చేశారంటూ.. చిరును అభిమనందిసతున్నారు. అంతే కాదు మీరు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలి అంటూ.. అభిమానులంగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌