Thangalaan Postponed : విక్రమ్ ‘తంగలాన్’ రిలీజ్ వాయిదా.. ఎందుకు? మళ్లీ ఎప్పుడు?

Published : Jan 16, 2024, 02:53 PM ISTUpdated : Jan 16, 2024, 02:56 PM IST
Thangalaan Postponed : విక్రమ్ ‘తంగలాన్’ రిలీజ్ వాయిదా.. ఎందుకు? మళ్లీ ఎప్పుడు?

సారాంశం

చియాన్ విక్రమ్ ‘తంగలాన్’ Thangalaan మూవీ జనవరిలోనే విడుదల కావాల్సింది. కానీ రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తూ మేకర్స్ తాజాగా ప్రకటన వెల్లడించారు. ఇంతకీ ఎందుకు వాయిదా వేశారంటే?  

చియాన్ విక్రమ్ ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ముందుంటారనే విషయం తెలిసిందే. తన పోషించే పాత్ర కోసం ఎంత శ్రమిస్తుంటారు. పూర్తిగా ఆ పాత్రలాగే మారిపోతుంటారు. ఈ క్రమంలో తాజాగా ‘తంగలాన్’ Thangalaan అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇందులో ట్రైబ్ గా అలరించబోతున్నారు. 19వ శతాబ్దంలోని ఓ తెగకు చెందిన నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే, ఈ చిత్రం జనవరి 26 గ్రాండ్ గా రిలీజ్ కావాల్సి ఉంది. రిపబ్లిక్ డేకు వస్తుందని ఆశించిన అభిమానులు, ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. సంక్రాంతికి అందరూ గుడ్ న్యూస్ చెబితే.. ‘తంగలాన్’ యూనిట్ మాత్రం నిరాశపరిచే న్యూస్ అందించారు. అదే ‘తంగలాన్’ వాయిదా. ఈ మూవీ రిలీజ్ ను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేసినట్టు తెలిపారు. 2024 ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుందని ప్రత్యేకమైన పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. కానీ పక్కా డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు. త్వరలో దానిపైనా క్లారిటీ రానుంది. ఈ మూవీని థియేటర్లలో చూడాలంటే సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే. 

‘తంగలాన్’ ను వాయిదా వేయడానికి కారణం కూడా ఉంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఫిలిం ఫెస్టివల్స్ కు పంపిస్తున్నారంట. అలాగైతే సినిమాకు మంచి అప్లాజ్ రానుంది. ఆ తర్వాత రిలీజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే సినిమా రిలీజ్ ను వాయిదా వేశారు. ఇక ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించారు. బ్రిటీష్ కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో ఆక్రమణలను ఎదుర్కొన్న ఓ తెగ గురించి చెప్పబోతున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. మాళవికా మోహనన్ Malavika Mohanan, పార్వతి తిరువొత్తు హీరోయిన్లుగా నటించారు. స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌