
సూపర్ స్టార్ రజనీకాంత్.. ఇప్పుడు `‘వేట్టయాన్`(vettaiyan) చిత్రంలో నటిస్తున్నారు. `జై భీమ్` ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో భారీ కాస్టింగ్ ఉంది. `జైలర్` తరహాలోనూ ఈ మూవీలోనే ప్యాడింగ్ పెద్దగానే ఉంటుంది. అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్స్, రితికా సింగ్ నటిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
‘వేట్టయాన్` చిత్రంలో మరోసారి రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. తాజాగా టీమ్ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. అక్టోబర్‌లో సినిమా విడుదల కాబోతున్నట్టు తెలిపింది. ‘వేట్టయాన్` ఈ అక్టోబర్ ఛార్జ్ తీసుకోబోతున్నారు` అని వెల్లడించింది టీమ్. ఈ లెక్కన దసరా సందర్భంగా ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది. ఇదే నిజమైతే ఇప్పుడు అక్టోబర్‌లో మరోసారి బిగ్ ఫైట్ చోటు చేసుకోబోతుందని చెప్పొచ్చు.
అక్టోబర్‌లో తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలు డేట్స్ ని ప్రకటించింది. ఎన్టీఆర్ `దేవర` దసరాకి అక్టోబర్ 10న రాబోతుంది. మరోవైపు ఒక్కరోజు గ్యాప్‌తో నాగ చైతన్య `తండేల్` వస్తుంది. అంతేకాదు లేటెస్ట్ సమాచారం మేరకు రామ్ చరణ్ `గేమ్‌ఛేంజర్` కూడా అక్టోబర్ డేట్‌నే ఎయిమ్ చేశారట. అక్టోబర్ అంటే దసరానే కాబట్టి అటు ఇటుగా అప్పుడే రాబోతుంది. ఇప్పుడు రజనీకాంత్ మూవీ కూడా అక్టోబర్ అనే ప్రకటించడంతో అక్టోబర్ ఫైట్ వేరే లెవల్‌లో ఉండబోతుందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే గతేడాది `జైలర్` చిత్రంతో రికార్డులు షేక్ చేశారు రజనీకాంత్. ఆ మూవీ ఏకంగా 650కోట్లు వసూలు చేసింది. ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నిర్మాతలకు లాభాల పంట పండించింది. అందులోనూ రజనీకాంత్‌తోపాటు మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ లుగా మెరిశారు. ఇప్పుడు ‘వేట్టయాన్`లోనూ భారీ కాస్టింగ్ ఉంది. మరి ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుంది. రజనీకాంత్ మళ్లీ బాక్సాఫీసుని షేక్ చేస్తాడా అనేది చూడాలి. ఇక ‘వేట్టయాన్` చిత్రాన్ని లైకా నిర్మిస్తుంది. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.