రాంచరణ్ కి 'నాటు'గా బర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. వీడియో భలే ఉందే..

Published : Mar 27, 2024, 02:45 PM IST
రాంచరణ్ కి 'నాటు'గా బర్త్ డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. వీడియో భలే ఉందే..

సారాంశం

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నేడు తన 39వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు చరణ్ బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాంచరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నేడు తన 39వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో మెగా అభిమానులు చరణ్ బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రాంచరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాంచరణ్ కి కూతురు పుట్టిన తర్వాత జరుగుతున్న తొలి పుట్టిన రోజు. 

దీనితో చరణ్ తన ముద్దుల కూతురు క్లీం కారాతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరితో తిరుమలకి వెళ్లారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో రాంచరణ్ కి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా క్రేజీగా రామ్ చరణ్ కి బర్త్ డే విషెస్ చెప్పాడు. 

బ్యాగ్రౌండ్ లో నాటు నాటు సాంగ్ ప్లే అవుతుండగా అల్లు అర్జున్, చరణ్ స్టెప్పులు వేస్తున్నారు. అల్లు అర్జున్ ఈ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ వీడియో పోస్ట్ చేశారు. మెగా అభిమానులని ఈ వీడియో భలే ఆకట్టుకుంటోంది. 'హ్యాపీ బర్త్ డే టు మై స్పెషల్ కజిన్ .. లవ్యూ ఆల్వేస్ అంటూ బన్నీ పోస్ట్ చేశాడు. 

 

తమ బాండింగ్ గురించి ఎన్ని రూమర్స్ వచ్చినా అవన్నీ గాలి మాటలే అని అల్లు అర్జున్ మరోసారి ప్రూవ్ చేశాడు. అల్లు అర్జున్, చరణ్ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ గా రాణిస్తున్నారు. బన్నీ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. మరోవైపు చరణ్ శంకర్ దర్శకత్వంలోని గేమ్ ఛేంజర్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రం తర్వాత చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో.. అలాగే సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం