Jaragandi Lyrical Song: భారీ హంగులతో శంకర్ మార్క్ మాస్ సాంగ్.. రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ కేక!

Published : Mar 27, 2024, 10:01 AM ISTUpdated : Mar 27, 2024, 10:04 AM IST
Jaragandi Lyrical Song: భారీ హంగులతో శంకర్ మార్క్ మాస్ సాంగ్.. రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ కేక!

సారాంశం

నేడు రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ నుండి లిరికల్ సాంగ్ విడుదల చేశారు. భారీ హంగులతో శంకర్ మార్క్ సాంగ్ లో కనిపించింది.   

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. 1985 మార్చి 27న రామ్ చరణ్ జన్మించాడు. 39వ ఏట అడుగుపెట్టాడు. రామ్ చరణ్ బర్త్ డే నేపథ్యంలో గేమ్ ఛేంజర్ మూవీ నుండి లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. 'జరగండి' టైటిల్ తో విడుదల చేసిన ఈ మాస్ సాంగ్ ఆకట్టుకుంది. శంకర్ చిత్రాల్లో పాటలు చాలా ప్రత్యేకం. ఆయన చిత్రీకరించినంత గొప్పగా సాంగ్స్ మరొక దర్శకుడు తెరకెక్కించలేడు. శంకర్ ప్రతి సినిమాలో సాంగ్స్ సూపర్ హిట్. 

గేమ్ ఛేంజర్ కోసం కూడా ఆయన భారీ హంగులతో సాంగ్స్ సిద్ధం చేస్తున్నారని 'జరగండి..' సాంగ్ చూశాక అర్థం అవుతుంది. కోట్లు వెచ్చించి ఒక కలర్ఫుల్ సెట్ వేశారు. వందల మంది డాన్సర్స్ తో జరగండి సాంగ్స్ చిత్రీకరించారు. శంకర్ మార్క్ భారీ తనం కనిపిస్తుంది. ఇక సాంగ్ లో రామ్ చరణ్ లుక్ అదిరింది. కియారా అద్వానీ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ప్రభుదేవా 'జరగండి' సాంగ్ కి కొరియోగ్రఫీ అందించారు.

థమన్ స్వరాలు అలరించాయి. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. మొత్తంగా గేమ్ ఛేంజర్ నుండి విడుదలైన మొదటి లిరికల్ వీడియో సాంగ్ జరగండి... అద్భుతంగా ఉంది. సినిమా మీద అంచనాలు పెంచేసింది. గేమ్ ఛేంజర్ యాక్షన్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఒకే ఒక్కడు పొలిటికల్ డ్రామాల్లో ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. ఈ క్రమంలో గేమ్ ఛేంజర్ పై ఆసక్తి పెరుగుతుంది. 

రామ్ చరణ్ కెరీర్లో మొదటిసారి ఐఏఎస్ అధికారి రోల్ చేస్తున్నారు. అలాగే పీరియాడిక్ పాత్రలో ఆయన పొలిటికల్ లీడర్ గా కనిపించనున్నాడని సమాచారం. శంకర్ భారతీయుడు 2 షూటింగ్ లో బిజీ కావడం వలన గేమ్ ఛేంజర్ చిత్రీకరణ ఆలస్యం అయ్యింది. ఇటీవల వైజాగ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది
Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది