Prithviraj Sukumaran : ‘బ్రో డాడీ’ రీమేక్ లో చిరు - రామ్ చరణ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Mar 27, 2024, 01:44 PM IST
Prithviraj Sukumaran : ‘బ్రో డాడీ’ రీమేక్ లో చిరు - రామ్ చరణ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సారాంశం

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తే బాగుంటుందన్నారు. పైగా తన సినిమా రీమేక్ లోనే నటించాలని అభిప్రాయపడ్డారు.

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘సలార్’ (Salaar)  చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రభాస్ (Prabhas)కి స్నేహితుడి పాత్రలో మెప్పించారు. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా ‘ది గోట్ లైఫ్’ The Goat Life)  అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ మూవీ రేపు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

ఇప్పటికే టాలీవుడ్ లో పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా టాలీవుడ్ స్టార్స్ పై ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడారు. ఇక తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. 
 
తను, మోహన్ లాల్ నటించిన మలయాళం ఎంటర్‌ టైన్‌మెంట్ ‘బ్రో డాడీ’ (Bro Daddy) మూవీని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందన్నారు. అందులో  మోహన్ లాల్ పాత్రను చిరంజీవితో బ్రో డాడీని తెలుగులోకి తీసుకురావడానికి ప్రణాళికలు ఉన్నాయన్నారు. కొన్ని కారణాల మళ్లీ వెనుకంజ వేశామన్నారు. ఇక ఆ చిత్రాన్ని తెలుగులో తీసుకొస్తే మాత్రం కొడుకు పాత్రలో రామ్ చరణ్ ను తీసుకోవాలని భావించారు. 

మెగా స్టార్ - చిరంజీవి కాంబోలో చివరిగా ‘ఆచార్య’ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘బ్రో డాడీ’ చిత్రం రీమేక్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. గతంలో కూడా ఈ రీమేక్ పై వార్తలు వచ్చినా ముందు పడలేదు. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలంటున్నారు. ఇక ఇలా పృథ్వీరాజ్ తన GOATLIFE (Adujeevitham) సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. తన మాటాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

PREV
click me!

Recommended Stories

Prabhas in Japan: జపాన్ లో భూకంపం నుంచి ప్రభాస్ సేఫ్.. హమ్మయ్య, రెబల్ స్టార్ కి గండం తప్పింది
8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్