ఆ డబ్బులకోసమే నరేష్ ను పట్టుకుంది, పవిత్ర పై షాకింగ్ కామెంట్స్ చేసిన మొదటి భర్త సుచేంద్ర

By Mahesh Jujjuri  |  First Published Mar 14, 2023, 5:17 PM IST

పవిత్ర లోకేష్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.. ఆమె మొదటి భర్త.. సుచేంద్ర. నరేష్ తో ఆమె కలిసి ఉండటం వెనుక అసలు కారణాలు ఏంటో వివరించాడు సుచేంద్ర. అంతే కాదు పవిత్ర గురించి షాకింగ్ విషయాలు వెల్లడిచారు. 


పవిత్ర ‌-నరేష్ కు సబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ మధ్య వీరు ఏదొ ఒక పని చేసి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. పవిత్రతో పెళ్ళి జరిగినట్టు ఓ వీడియో రిలీజ్ చేసిన నరేష్.. అది ప్రమోషన్ వీడియో అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో నెటిజన్లు మండిపడ్డారు. జనాలను ఫూల్స్ ను చేద్దామనుకుంటున్నారా అంటూ తెగ ట్రోల్ చేశారు. ఈక్రమంలో ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతున్నారు నరేష్, పవిత్ర. 

ప్రస్తుతం సహజీవనం చేస్తున్న ఈ ఇద్దరు తారలు.. త్వరలో పెళ్ళి చేసుకుంటారన్న వార్తలు ఊపు అందుకున్నాయి. ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకుని సంచలనం సృష్టించిన నరేష్.. మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు అవ్వకముందే.. పవిత్ర లోకేష్ తో కలిసి ఉంటున్నాడు. అటు పవిత్రకు కూడా రెండు పెళ్ళిళ్ళు అయినట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరి విషయం టాలీవుడ్ లో పెద్ద సెన్సేషన్ గా మారింది. ఈక్రమంలో ప్రస్తుతం వీరిద్దరి గురించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. 

Latest Videos

సహజీవనం.... ఎక్కువ పెళ్ళిళ్ళ విషయంలో వీరిద్దరిని విమర్షించే  వారితో పాటు.. సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నాయి. అయితే పవిత్ర విషయంలో  మాత్రం ఎక్కువగా ఆమె మొదటి భర్త నుండే వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఎందుకో తెలియదు కాని.. ఛన్స్ దొరికితే చాలు పవిత్రపై మండిపడుతూ.. ఆమెకు సబంధించిన విషయాలు బయటపెడుతూ.. వైరల్ కామెంట్స్ చేస్తున్నారు సుచేంద్ర. ప్రతి సారి పవిత్ర గురించి ఘోరమైన కామెంట్లు చేస్తున్నాడు. సుచేంద్ర ప్రసాద్ తాజాగా పవిత్ర గురించి మరోసారి మండిపడ్డాడు.  ఆయన మాట్లాడుతూ..పవిత్రకి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం. ఆమె దాని కోసం ఏ పని అయినా చేస్తుంది.  ఆమె  అవకాశవాది అంటూ ఫైర్ అయ్యారు. 

ముఖ్యంగా నరేష్ విషయంలో ఆమె ప్లాన్ వేరే ఉంది. విజయ నిర్మల గారు సంపాదించిన 1500 కోట్ల ఆస్తిపై ఆమె కన్ను పడింది.వాటిని ఎలాగైన కొట్టేయాలి అనే దురేద్దేశ్యంతనే నరేష్ వెంట తిరుగుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సుచేంద్ర. డబ్బు కోసమే ఇప్పటికీ ఇద్దరికి విడాకులు ఇచ్చింది. అయితే ఈ విషయంలో  నరేష్ కు ఇంకా తెలిసి రావడం లేదు. ఏదో ఒకరోజు తనకు కూడా తెలుస్తుంది. పవిత్ర డబ్బు పిచ్చిది కూడా అతనికి అర్ధం అయ్యే రోజు వస్తుంది అన్నారు. 

అంతే కాదు డబ్బు లేకపోతే పవిత్ర ప్రశాంతంగా ఉండలేదు.అది ఉన్నన్నాళ్ళు నరేష్ తో ఆమె కలిసుంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు పవిత్ర మొదటి భర్త సుచేంద్ర. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో వారు ఎలా స్పందిస్తారు అనేది మాత్ర చూడాలి. 

click me!