బన్నీ బర్త్ డే గిఫ్ట్.. పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేస్తుంది!

Published : Apr 03, 2021, 12:25 PM IST
బన్నీ బర్త్ డే గిఫ్ట్.. పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేస్తుంది!

సారాంశం

సుకుమార్ అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ సిద్ధం చేశాడు. ఆయన పుట్టినరోజు కానుకగా పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ సిద్ధం చేస్తున్నారు. నేడు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు.

దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ సిద్ధం చేశాడు. ఆయన పుట్టినరోజు కానుకగా పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ సిద్ధం చేస్తున్నారు. నేడు దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 7 సాయంత్రం 6:12 నిమిషాలకు పుష్ప ఫస్ట్ లుక్ టీజర్ విడుదల కానుంది.  అలాగే నేడు ప్రీ లుక్ టీజర్ విడుదల చేయడం జరిగింది. ముఖానికి మాస్క్, రెండు చేతులు వెనుకకు కట్టి ఉన్న అల్లు అర్జున్ దట్టమైన అరణ్యంలో పరుగులు తీస్తున్నారు. పుష్పరాజ్ ప్రేలుడు పేరుతో విడుదల కానున్న ఫస్ట్ లుక్ పై ప్రీ లుక్ వీడియో అంచనాలు పెంచేస్తుంది. 


సుకుమార్ పుష్ప చిత్రాన్ని రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. బన్నీ గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే కూలీగా కనిపించనున్నాడన్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ టీజర్ తో ఆ విషయంపై పూర్తి అవగాహన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రీ లుక్ టీజర్ లో సైతం, పోలీసుల బారినుండి తప్పించుకొని పారిపోతున్నట్లుగా అల్లు అర్జున్ లుక్ ఉంది. మొత్తంగా పుష్ప రూపంలో సుకుమార్ మరో అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారని అర్థం అవుతుంది.

 
పుష్ప పాన్ ఇండియా చిత్రంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం ఇదే కావడం విశేషం.
 

PREV
click me!

Recommended Stories

BMW Teaser: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ రివ్యూ.. వరుస డిజాస్టర్లతో రూటు మార్చిన రవితేజ, రొమాన్స్ షురూ
Missterious Review: 'మిస్‌టీరియస్' మూవీ రివ్యూ.. ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో మిస్టరీ ఆకట్టుకుందా, తేలిపోయిందా ?