ముద్దు సీన్ చేయడానికి పర్మిషన్ అడిగిన ప్రభాస్

Published : Apr 03, 2021, 08:39 AM IST
ముద్దు సీన్ చేయడానికి పర్మిషన్ అడిగిన ప్రభాస్

సారాంశం

ప్రభాస్, శ్రీను ఒకే చోట నటనలో శిక్షణ తీసుకున్నారట. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించిందని, శ్రీను చెప్పడం జరిగింది. ప్రభాస్ కెరీర్ బిగినింగ్ నుండి ఆయనను దగ్గరగా చూస్తున్న శ్రీను అనేక సందర్భాల్లో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

కమెడియన్ ప్రభాస్ శ్రీనుకి... ప్రభాస్ మిత్రుడు, చాలా సన్నిహితుడన్న పేరుంది. సినిమాలలోకి రాకముందు నుండే వీరిద్దరి మధ్యన స్నేహం ఉందట. ప్రభాస్, శ్రీను ఒకే చోట నటనలో శిక్షణ తీసుకున్నారట. ఆ సమయంలోనే వీరి మధ్య స్నేహం చిగురించిందని, శ్రీను చెప్పడం జరిగింది. అప్పట్లో ప్రభాస్ నటించిన ప్రతి సినిమాలో శ్రీనుకు క్యారెక్టర్ ఉండేది. 


డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలలో ప్రభాస్ శ్రీను కనిపించాడు. అందుకే శ్రీను కాస్తా ప్రభాస్ శ్రీను అనే స్క్రీన్ నేమ్ గా మారిపోయింది.  ప్రభాస్ కెరీర్ బిగినింగ్ నుండి ఆయనను దగ్గరగా చూస్తున్న శ్రీను అనేక సందర్భాల్లో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. కాగా ఓ సందర్భంలో ముద్దు సీన్ లో నటిండం కోసం ప్రభాస్ వాళ్ళ నాన్న పర్మిషన్ తీసుకున్నారట. 

బి గోపాల్ దర్శకత్వంలో ప్రభాస్ అడవి రాముడు చిత్రం చేశారు. 2004లో విడుదలైన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ తో ఓ ముద్దు సిన్నివేశంలో నటించాల్సి ఉందట. ఆ సమయంలో ప్రభాస్...  వాళ్ళ నాన్న సూర్యనారాయణ రాజుకు ఫోన్ చేసి మరి పర్మిషన్ తీసుకున్నారట. ఆయన పర్మిషన్ ఇచ్చాకే, ఆ సీన్ లో ప్రభాస్ నటించినట్లు నటుడు ప్రభాస్ శ్రీను తెలియజేశాడు.

PREV
click me!

Recommended Stories

Sai Pallavi: ఒక్క రోజు లీవ్ కోసం వెక్కి వెక్కి ఏడ్చిన సాయి పల్లవి.. నేచురల్ బ్యూటీకి ఎందుకా పరిస్థితి వచ్చింది?
ఎన్టీ రామారావు ను చూసి భయంతో డైలాగ్ మర్చిపోయిన స్టార్ కమెడియన్, డైరెక్టర్ తో చీవాట్లు తిన్నది ఎవరు?