అల్లు అర్జున్ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో, అట్లీ ఏం చేయబోతున్నాడు?

Google News Follow Us

సారాంశం

అల్లు అర్జున్ తో సినిమాను అంత ఈజీగా తీసుకోలేదు అట్లీ. పాన్ వరల్డ్ సినిమాగా తీర్చిదిద్దాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. అందుకోస ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. నటీనటుల దగ్గర నుంచి షూటింగ్ లొకేషన్ల వరకూ అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు అట్లీ. ఇక ఈ ఈ సినిమాపై  రోజుకోరకమైన న్యూస్ బయటకు వస్తోంది.

అల్లు అర్జున్ సినిమాను అట్లీ ఏం చేస్తాడా అని ఫ్యాన్స్ లో కాస్త భయం ఉంది.  రాజమౌళిని మించిపోవాలని, హాలీవుడ్ రేంజ్ కు వెళ్లిపోవాలని చూస్తున్నాడు అట్లీ.  అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నాడు. బన్నీ సినిమాకు సబంధించి అంతా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అట్లీ, హీరోయిన్లు, ఇతర నటీనటులు, యాక్షన్ సీక్వెన్స్ లు, అంతా అంతకు మించి ఉంటుందట. ఈక్రమంలో ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ ను కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 


హాలీవుడ్ రేంజ్ లో అల్లు అర్జున్ సినిమా

అల్లు అర్జున్ తో  అట్లీ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచి హడావిడి మొదలయ్యింది. ఈసినిమాకు సబంధించి రకరకాల  వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈమూవీతో అట్లీ హాలీవుడ్ రేంజ్ కు వెళ్ళిపోవాలని ప్లాన్ తో ఉన్నాడు. అందుకే సాహసం చేసి 800 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈసినిమాను తెరెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈసినిమా రూపొందుతోంది. బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. 

ఈ సినిమా ఎంత భారీగా ఉండబోతుందో స్పెషల్ వీడియోతో  చెప్పకనే చెప్పారు. హాలీవుడ్ రేంజ్ లో ఈమూవీని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నా.. ఓ పక్క అట్లీని ఇంతలా నమ్మి.. అనవసరంగా రిస్క్ చేస్తున్నాడా అని ఆందోళన కూడా ఉంది అభిమానుల్లో. అసలు ఇంతకీ ఇది తెలుగు సినిమానేనా అని సందేహం కూడా వస్తుంది ఆడియన్స్ కు. మరి అట్లీ ఈసినిమాను ఏంచేస్తాడో చూడాలి. 

అల్లు అర్జున్  అట్లీ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్

ఇక ఈసినిమాకు సబంధించి అంచనాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో వార్త ఈ మూవీ నుంచి వినిపిస్తుంది. హీరోయిన్ల గురించి, షూటింగ్ గురించి, నటీనటుల గురించి రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. తాజాగా అల్లు అర్జున్ అట్లీ సినిమాలో  హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విల్ స్మిత్‌ను ముఖ్యమైన పాత్రను చేయించాలని  దర్శకుడు అట్లీ ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నాడని తెలుస్తోంది.  ఆస్కార్ అవార్డు విన్నర్ అయిన విల్ స్మిత్ కు హాలీవుడ్ తో పాటు ఇండియాలో కూడా భారీగా ఫ్యాన్స్ ఉన్నారు.  56 ఏళ్ల విల్ స్మిత్ మెన్ ఇన్ బ్లాక్ సిరీస్‌  ఇండియాలో కూడా భయంకరమైన క్రేజ్ ను సంపాదించింది. నటుడు నిర్మాత అయిన  విల్ స్మిత్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు.

 ఇప్పుడు ఇదే మూవీ టీమ్ కు ఇబ్బందిగా మారిందట. పెద్దగా సినిమాలు చేయడంలేదు స్మిత్. మరి అలాంటప్పుడు ఈ సినిమా చేస్తారా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కాని  అల్లు అర్జున్ సినిమాలో  విల్ స్మిత్‌ను ఎలాగైనా  ఒప్పించేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నుంచి ఓ ప్రత్యేక  బృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అల్లు అర్జున్ సినిమాలో విల్ స్మిత్ నటిస్తారా లేదా అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. అసలు ఈ విషయంలో నిజమెంతో కూడా తెలియబోతోంది. 

ముగ్గరు హీరోయిన్లతో అల్లు అర్జున్ రొమాన్స్ 

ఇక ఈసినిమాకు సబంధించి ప్రతీరోజు ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది.  తాజా సమాచారం ప్రకారం  ఈసినిమాలో  అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడట, ఈ విషయం నిజం అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియోలో అందుకు తగ్గ హింట్స్ కూడా ఇచ్చారు టీమ్. ఇక ఈమూవీలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను అనుకున్నారు. కాని ఆమె రాజమౌళి సినిమాతో బిజీగా ఉండటంతో జాన్వీ కపూర్ ను ఫిక్స్ చేశారట. మరో ట్విస్ట్ ఏంటంటే.. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ముగ్గరు హీరోయిన్లు నటిస్తున్నారు. 

జాన్వీ కపూర్ తో పాటు మరో పాత్ర కోసం సమంతను ఓకే చేశారట టీమ్.  సమంత ఈసినిమాలో  చాలా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆమె చేయబోయేది లేడీ విలన్ రోల్ అని కూడా అంటున్నారు. ఇక ముచ్చటగా మూడో హీరోయిన్ కోసం వేట మొదలయ్యింది. శ్రద్దా కపూర్ కాని, దిశా పటాని కాని ఇద్దిరలో ఎవరో ఒకరు ఫిక్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసినిమాకు సబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరగుతుంది. భారీ ఎత్తున ఈసినిమాను నిర్మిస్తున్నారు సన్ పిక్చర్స్ నిర్మాతలు. 

Read more Articles on