అల్లు అర్జున్, అట్లీ మూవీ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ కి ముహూర్తం ఫిక్స్.. ఖడ్గం చూపిస్తూ..

Published : Jun 06, 2025, 09:56 PM IST
Allu Arjun

సారాంశం

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాపై భారీ ప్రకటన వెలువడనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.

అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్ 

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, మాస్ యాక్షన్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న అట్లీ కాంబినేషన్ లో భారీ చిత్రం రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

AA22 నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ 

ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై, చిత్ర బృందం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. జూన్ 7, 2025 ఉదయం 11 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన బిగ్  అప్డేట్ ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో పాటు ఒక ఆసక్తికర పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో ఒక వ్యక్తి ఖడ్గం పట్టుకొని ఉన్నట్లు చూపించారు. ఇది సినిమాకు సంబంధించిన యాక్షన్ టోన్‌ను సూచిస్తోంది అని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మూవీలో యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతోందో హింట్ ఇచ్చారు.

 

 

ఇప్పటివరకు ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర, ఫస్ట్ లుక్, ఇతర తారాగణం, విడుదల తేదీ వంటి వివరాలు ప్రకటించలేదు. కాబట్టి, జూన్ 7న వెలువడనున్న ప్రకటనపై భారీ ఉత్కంఠ నెలకొంది. ఇది అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ అవుతుందా? లేక అట్లీ దర్శకత్వ శైలికి తగ్గట్టు ప్రత్యేకమైన వీడియో గ్లింప్స్‌ను విడుదల చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్, అట్లీ ఇద్దరికీ పాన్ ఇండియా క్రేజ్ 

అట్లీ గతంలో విజయ్‌తో కలిసి చేసిన తేరి, బిగిల్, అలాగే షారుక్ ఖాన్‌తో చేసిన జవాన్ వంటి హిట్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. అల్లు అర్జున్ చివరిగా పుష్ప 2 చిత్రంతో  దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ నుంచే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో, జూన్ 7 ఉదయం 11 గంటల రాబోయే ప్రకటన ఎలా ఉంటుందో, సినిమాపై ఎంతలా అంచనాలు పెంచుతుందో చూడాలి. ఈ చిత్రాన్ని అట్లీ పార్లల్ యూనివర్స్ కాన్సెప్ట్ తో రూపొందించబోతున్నట్లు ఇప్పటికే లీకులు అందాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venkatesh Top 10 Movies: తప్పక చూడాల్సిన వెంకటేష్‌ టాప్‌ 10 మూవీస్‌.. ఇలాంటి రికార్డు ఉన్న ఒకే ఒక్క హీరో
Illu Illalu Pillalu Today 13 డిసెంబర్ ఎపిసోడ్ : రామరాజు ముందు నోరు విప్పిన చందు, అమూల్య బలి, భర్తను బకరా చేసిన వల్లి