
దర్శకుడు కేవీ ఆనంద్ అకాల మరణం తమిళ చిత్ర పరిశ్రమని షాక్‌కి గురి చేసింది. ఆయన హఠాన్మరణంతో చిత్ర పరిశ్రమ వర్గాలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంతాపం తెలిపారు. `కె.వి ఆనంద్ చనిపోయారనే విచారకరమైన వార్తతో ఈ రోజు నిద్రలేచాను. ఆయన అద్భుతమైన కెమెరామెన్, బ్రిలియంట్ డైరెక్టర్, మంచి జెంటిల్‌మెన్. సర్ మీరు ఎప్పటికీ గుర్తుంటారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాం. మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా` అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు బన్నీ. వీరితోపాటు నటి ఖుష్బు సుందర్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. అలాగే దర్శకుడు ప్రియదర్శన్, మంచు మనోజ్ వంటి వారు సంతాపాన్ని తెలిపారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం హీరో సూర్య.. కెవి ఆనంద్ భౌతిక కాయాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. కె.వి.ఆనంద్‌ని ఎంఐఓటీ ఆసుపత్రిలో చేర్పించారు.