వర్మకు తెగ నచ్చేసిన సినిమా టైటిల్

By Surya PrakashFirst Published Apr 30, 2021, 8:24 AM IST
Highlights

రామ్ గోపాల్ వర్మ కు  దెయ్యాలతో మంచి దోస్తే ఉంది. వాటి సైకాలిజీ కూడా ఆయనకు తెలుసు. ఇలాంటి వర్మకే ఓ కొత్త దెయ్యం సినిమా టైటిల్ తెగ నచ్చేసి ఆశ్చర్యపరిచిందట.

ముందు నుంచీ ఆర్జీవీకి దెయ్యం సినిమాలంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. కెరీర్ మొద‌లెట్టిన కొత్త‌లో `రాత్రి` అనే సినిమా తీసి అంద‌రినీ భ‌య‌పెట్టారు ఆయన. అయితే ఆ రోజుల్లో మన తెలుగులోనూ  దెయ్యం సినిమాలు కొత్త‌. రామ్ గోపాల్ వర్మ వాటిని చూపించిన విధానం కూడా కొత్తే. కాబ‌ట్టి.. రాత్రి, దెయ్యం లాంటి సినిమాలు ప్రేక్ష‌కుల్ని బాగానే ఆకట్టుకున్నాయి. ఆ త‌ర‌వాత లో బడ్జెట్ లో దెయ్యం సినిమాలు వరసపెట్టి తీస్తూనే ముందుకు వెళ్ల సాగాడు. 

దానికి తోడు ఇలాంటి క‌థ‌ల‌కు పెద్ద‌గా స్టార్ కాస్టింగ్ అవ‌స‌రం లేకుండా పోవ‌డం కూడా వ‌ర్మ ఈ దారిని ఎంచుకోవటానికి కారణమైంది. అంతెందుకు రీసెంట్ గా మ‌రో `దెయ్యం` సినిమా తీసి వ‌దిలాడు. ఎప్పుడో `ప‌ట్ట‌ప‌గ‌లు` పేరుతో మొద‌లెట్టిన సినిమా… ఆగి, ఆగి `ఆర్జీవీ దెయ్యం`లా పేరు మార్చుకొచ్చింది. అయితే ఈ దెయ్యం భ‌య‌పెట్టలేకపోయింది. ఇలా ఆయనకు దెయ్యాలతో మంచి దోస్తే ఉంది. వాటి సైకాలిజీ కూడా ఆయనకు తెలుసు. ఇలాంటి వర్మకే ఓ కొత్త దెయ్యం సినిమా టైటిల్ తెగ నచ్చేసి ఆశ్చర్యపరిచిందిట. అదేమిటంటే..
 
 దాసరి సాయిరాం అనే కొత్త డైరక్టర్ దర్శకత్వంలో.. భీమవరం టాకీస్ పతాకంపై నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హార్రర్ థ్రిల్లర్ “దెయ్యం గుడ్డిధైతే”. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం ట్రైలర్ ని రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.

వర్మ మాట్లాడుతూ… “నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను. ఆ తరహా చిత్రాలు లెక్కలేనన్ని చూశాను. కానీ… దెయ్యం సినిమాలో.. దెయ్యం గుడ్డిది కావడం ఇప్పటివరకూ చూడలేదు. దానిని హైలైట్ చేస్తూ… “దెయ్యం గుడ్డిదైతే” అనే టైటిల్ పెట్టడం ఇంకా చాలా ఇన్నోవేటివ్ గా ఉంది. ఈ సినిమా సాయిరామ్ దాసరికి దర్శకుడిగా మంచి పేరు తీసుకురావాలని విష్ చేస్తున్నాను” అన్నారు.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. “సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మా “దెయ్యం గుడ్డిదైతే” చిత్రం ట్రైలర్ రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

సుమీత్-జాకీర్-హైమ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాఘవ, ఎడిటర్: రంగస్వామి, స్క్రీన్ ప్లే-డైలాగ్స్-డి ఐ: జానీ బాషా, ఆడియోగ్రఫీ 5.1: శ్రీమిత్ర, టైటిల్స్ & పోస్టర్స్ ప్రవీణ్ తమటం, సమర్పణ: సంధ్య స్టూడియో, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: సాయిరామ్ దాసరి!! 
 

click me!