థ్రిల్లర్: అల్లరి నరేష్ కొత్త రూట్..

Published : Feb 20, 2019, 09:01 PM ISTUpdated : Feb 20, 2019, 09:04 PM IST
థ్రిల్లర్: అల్లరి నరేష్ కొత్త రూట్..

సారాంశం

ఒకప్పుడు కమెడియన్ గా మినిమమ్ హిట్స్ తో ఏడాదికి మూడు సినిమాలతో రచ్చ చేసిన అల్లరి నరేష్ ఇప్పుడు ఎక్కువగా కనిపించడం లేదు. అల్లరి నరేష్ నుంచి అభిమానులు కోరుకుంటున్న కంటెంట్ చాలా వరకు తగ్గింది అనే టాక్ గట్టిగా వస్తోంది. తండ్రి ఇవివి సత్యనారాయణ ఉన్నప్పుడు కొడుకుతోనే ఎక్కువ సినిమాలు చేసేవారు. 

ఇవివి అనుకుంటే నరేష్ కి హిట్టు గట్టిగా వచ్చేది. అయితే వరుస ప్లాప్స్ వల్ల ఇప్పుడు చాలా వరకు నరేష్ మార్కెట్ కూడా తగ్గిపోయింది. దీంతో నెక్స్ట్ ఎలాగైనా ఒక డిఫరెంట్ కంటెంట్ తో ఆడియెన్స్ ను మళ్ళీ తనవైపుకు తిప్పుకోవాలని నరేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. గతంలో నేను - బెట్టింగ్ బంగార్రాజు  - యముడికి మొగుడు వంటి డిఫరెంట్ సినిమాలు అల్లరి నరేష్ తో చేసిన ఈ సత్తిబాబు మరోసారి నరేష్ కలవనున్నారు. ఈ సారి సత్తిబాబు థ్రిల్లర్ కథతో రాబోతున్నాడు. 

అల్లరి నరేష్ గెటప్ కూడా థ్రిల్లర్ కథకు తగ్గట్టుగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం నరేష్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. నరేష్ ఆ సినిమాలో మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా అనంతరం నరేష్ తన కొత్త సినిమాను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Kriti Sanon: అల్లు అర్జున్‌పై మహేష్‌ బాబు హీరోయిన్‌ ఇంట్రెస్ట్
మేకప్ పై సాయి పల్లవి ఓపెన్ కామెంట్స్, ఆ తలనొప్పి నాకు లేదంటున్న స్టార్ హీరోయిన్