సూర్య డాడీ.. ఈసారి ఫోన్ పగల్లేదు!

By Prashanth MFirst Published 20, Feb 2019, 8:32 PM IST
Highlights

కోలీవుడ్ సీనియర్ నటుడు హీరో సూర్య తండ్రి మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి వివాదంలో కాకుండా మంచి విషయంతోన్ అందరిని ఆకర్షించాడు. ఓ ఫ్యాన్ కి అడిగిన వెంటనే సెల్ఫీ ఇచ్చి అభిమానులకు సంతోషాన్ని ఇచ్చాడు.

కోలీవుడ్ సీనియర్ నటుడు హీరో సూర్య తండ్రి మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి వివాదంలో కాకుండా మంచి విషయంతోన్ అందరిని ఆకర్షించాడు. ఓ ఫ్యాన్ కి అడిగిన వెంటనే సెల్ఫీ ఇచ్చి అభిమానులకు సంతోషాన్ని ఇచ్చాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీగా గుర్తింపు తెచ్చుకున్న సూర్య కుటుంబం గతంలో ఒక సెల్ఫీ లొల్లి వల్ల ఊహించని విధంగా వివాదంలో ఇరుకున్న సంగతి తెలిసిందే. 

తండ్రి చేసిన తొందరపాటు వల్ల కార్తీ - సూర్య సోషల్ మీడియాలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు సూర్య అభిమాని శివకుమార్ తో సెల్ఫీ దిగుతుండగా ఆయనకు కోపం వచ్చి ఫోన్ నేలకేసి కొట్టాడు. దీంతో పెద్ద ఎత్తున్న అందుకు సంబందించిన వీడియో ట్రోలింగ్ కి గురైంది. అనంతరం శివ కుమార్ క్షమాపణలు చెప్పి ఆ కుర్రాడికి మరో ఫోన్ కొనిచ్చాడు. 

అయితే ఇప్పుడు ఓ ఈవెంట్ కు వెళ్లిన శివకుమార్ మరో యువ అభిమాని సెల్ఫీ అడిగిన వెంటనే స్టిల్ ఇచ్చాడు. దీంతో శివకుమార్ మారిపోయారు అని ఆయన్ను ఇక ట్రోల్ చేయడం ఆపాలని అందుకు సంబందించిన ఫోటోను సూర్య కార్తీ అభిమానులు షేర్ చేస్తున్నారు. 

Last Updated 20, Feb 2019, 8:32 PM IST