బాలయ్యతో సమరానికి కాలుదువ్వుతున్న అల్లరి నరేష్

Published : Aug 18, 2017, 10:33 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
బాలయ్యతో సమరానికి కాలుదువ్వుతున్న అల్లరి నరేష్

సారాంశం

బాలకృష్ణ 101వ సినిమాపై భారీ అంచనాలు ఇప్పటికే స్టంపర్, ట్రైలర్ తో పెరిగిన అంచనాలు పూరీ,బాలయ్యల పైసా వసూల్ తో పోటీకి కాలు దువ్వుతున్న అల్లరి నరేష్

సెప్టెంబర్ 1. ఇప్పటికే  ఈతేదీన బాలయ్య తాజా సినిమా పైసా వసూల్ రిలీజ్ డేట్ ప్రీ పోన్ అయి ప్రేక్షకుల ముంందుకొచ్చేందుకు రెడీగా వుంది. పూరీ కొత్తగా లాంచ్ చేసిన స్టంపర్ కాన్సెప్ట్ తోనే.. అన్నా.. రెండు బాల్కనీ టికెట్ లు కావాలె... అంటూ బాలయ్య యమా క్రేజ్ పెంచేశాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచేశాడు. 

 

 

బాలయ్య లాంటి యాక్షన్ హీరో కి పూరీ జగన్నాథ్ యాటిట్యూడ్ తోడైతే... ఎలా ఉంటుంది అనేది స్టంపర్, టీజర్ , ట్రైలర్ లు చూస్తేనే అర్ధం అయింది. ఇక విపరీతమైన హైప్ తో ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బిజినెస్ పరంగా కూడా బాలయ్య గత చిత్రాలని ఈ చిత్రం బీట్ చేయ్యనుంది అంటున్నారు. అయితే అంతటి భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తున్న పైసా వసూల్ కి పోటీకి కాలుదువ్వుతున్నాడు అల్లరి నరేష్.

 

అల్లరి నరేష్ నటిస్తున్న మేడ మీద అబ్బాయి సినిమా ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా వచ్చేసిందట. ఫైనల్ ప్రింట్ నమ్మకంగా కనిపిస్తూ ఉండడం తో ఈ సినిమాని కూడా సెప్టెంబర్ 1 నే విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు . రిలీజ్ డేట్ బ‌య‌ట‌కు చెప్ప‌క‌పోయినా… సెప్టెంబ‌రు మొద‌టి వారంలో సినిమాని విడుద‌ల చేస్తామ‌ని చిత్ర‌ బృందం ప్ర‌క‌టించేసింది. మరి ఫస్ట్ వీక్ అంటే సెప్టెంబర్ ఫస్టే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే హిట్ కోసం ఎదురుచూస్తున్న అల్లరి నరేష్ బాలయ్య తో పోటీ దిగడం అంటే.. ఆ ధైర్యానికి మొక్కాలి. 

 

PREV
click me!

Recommended Stories

నాగార్జున ను 15 ఏళ్లుగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య ఏంటో తెలుసా? ఎందుకు తగ్గడంలేదు?
Sivaji: కులం అనేది ఒక ముసుగు మాత్రమే, డబ్బున్నోళ్ల లెక్కలు వేరు.. శివాజీ బోల్డ్ స్టేట్‌మెంట్‌