BachhalaMalli : అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్ ‘బచ్చలమల్లి’.. ఇంతకీ బచ్చలమల్లి ఎవరో తెలుసా?

Published : Dec 01, 2023, 12:17 PM ISTUpdated : Dec 01, 2023, 12:18 PM IST
BachhalaMalli :  అల్లరి నరేష్ కొత్త సినిమా టైటిల్ ‘బచ్చలమల్లి’..  ఇంతకీ బచ్చలమల్లి ఎవరో తెలుసా?

సారాంశం

గతంలో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. మాస్ లుక్ లో అల్లరి నరేష్ ఆకట్టుకుంటున్నారు. తాజాగా టైటిల్ ను ప్రకటించారు. దీంతో ఈ మూవీ కథ ఆసక్తికరంగా మారింది. టైటిల్ లోని వ్యక్తి ఎవరు అనేది ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. 

అల్లరి నరేష్ (Allari Naresh)  మళ్లీ వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. గతంలో లాగా సినిమా జోరు చూపించకుండా.. విభిన్నమైన కథలతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు. కామెడీ కంటెంట్ కాకుండా.. సీరియస్ సబ్జెక్ట్స్ తో మెప్పిస్తున్నారు. తన నటనతోనూ అదరగొడుతున్నారు. కంబ్యాక్ తో ప్రయోగాలు చేస్తున్నారు. ‘నాంది’ , ‘ఇట్లు మారేడుమిల్లి’ చిత్రాలతో మెప్పించారు. చివరిగా ‘ఉగ్రం’తో ప్రేక్షకులను అలరించారు. ఆ వెంటనే మరో సినిమానూ కూడా అనౌన్స్ చేశారు. 

Naresh 62 వర్క్ టైటిల్ తో అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా గతంలో అనౌన్స్ మెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ను ప్రకటించారు. ‘బచ్చలమల్లి’ (Bachhala Malli)  గా అనౌన్స్ చేశారు. తాజాగా టైటిల్ ను అధికారికంగా వెల్లడించారు. టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇంతకీ ఈ టైటిల్ లో ఉన్న వ్యక్తి ఎవరు? ఆయన జీవిత కథనే సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. 

ఆ విషయానికొస్తే.. ఇటీవల బయోపిక్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. మురళీధర్ ముత్తయ్య, టైగర్ నాగేశ్వర్ వంటి చిత్రాలు వచ్చి అలరించాయి. ఇక తాజాగా అదే బాటలో అల్లరి నరేష్ కూడా పయనిస్తున్నారు. 1990లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని తునిలో గజదొంగగా పేరు గాంచిన బచ్చలమల్లి జీవిత కథనే తెరకెక్కిస్తున్నారు. రౌడీగానూ ముద్ర వేసుకున్న ఆయన పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నారు. ఓవైపు సిరీయస్ గా కథను నడిపిస్తూనే మరోవైపు కామెడీని బయటికి తీసుకువస్తున్నారని తెలుస్తోంది. 

ఇక ఈ  చిత్రాన్ని ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర దర్శకుడు సుబ్బు డైరెక్ట్ చేస్తున్నారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ని నిర్మించిన హాస్య మూవీస్ వారే ఈ చిత్రానికి కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం దర్శకులు గా వర్క్ చేస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటర్ గా, రిచర్డ్ సినిమాటోగ్రఫీ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. మిగితా వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌