మెగాస్టార్ తో ఛాన్స్ లేదు.. ఇక పవర్ స్టార్ వంతు.. పవన్ కళ్యాణ్ కోసం కొత్త కథ రాసిన మెహర్ రమేష్..?

Published : Dec 01, 2023, 12:05 PM ISTUpdated : Dec 01, 2023, 12:49 PM IST
మెగాస్టార్ తో ఛాన్స్ లేదు.. ఇక పవర్ స్టార్ వంతు..  పవన్ కళ్యాణ్  కోసం కొత్త కథ రాసిన మెహర్ రమేష్..?

సారాంశం

తాజాగామెగాస్టార్ చిరంజీవికి భోళా శంకర్ సినిమాతోడిజాస్టర్ ఇచ్చాడు దర్శకుడు మెహర్ రమేష్. స్టార్ హీరోలు ఇస్తున్నఅవకాశాలు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాడు దర్శకుడు.. ఇక తాజాగా పవర్ స్టార్ కోసం మెహర్ కథ రాస్తున్నట్టు తెలుస్తోంది. 

చాలా కాలం సినిమాలు లేక ఖాళీగా ఉన్నాడు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ మెహర్ రమేష్.  ఎప్పుడో పదేళ్ల క్రితం వెంకటేష్ తో షాడో సినిమా చేసి డిజాస్టర్ ఫేస్ చేశాడు మెహార్. ఆతువాత అతను సినిమాలు చేయలేదు.  ఒక రకంగా అవకాశాలు రాలేదని చెప్పవచ్చు. అయితే ఇన్నాళ్ళకు మెహర్ కు మెగాస్టరా్ చిరంజీవి రూపంలో అద్భుతమైన అవకాశం వచ్చింది. అయితే ఆ అవకాశాన్ని ఉపయెగించుకోలేక పోయాడు దర్శకుడు భోళా శంకర్‌తో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే సువర్ణావకాశం మెహర్ రమేష్‌కి  రాగా.. వచ్చింది. కానీ ఆ ఛాన్స్‌ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. 

ఈసినిమాలో మరోసారి భారీ డిజాస్టర్ ను ఫేస్ చేశాడు. బిల్లా లాంటి అద్భుతమైన సినిమాను డైరెక్ట్ చేసిన మెహర్.. మళ్ళీ అలాంటి క్రియేటివిటీని చూపించలేకపోతున్నాడు. దాంతో ..ఇండస్ట్రీలో పలుకుబడి ఉన్నా..సినిమా అవకాశాలు మాత్రం రావడంలేదు. అయితే ఓభోళా శంకర్ తరువాత  మెహర్ ఎక్కడా మీడియాలో లేదా ఏ ఈవెంట్‌లలో కనిపించలేదు. తాజాగా అతను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

మెగాస్టార్ కు డిజాస్టర్ ఇచ్చిన మెహర్ ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై దృష్టి పెట్టాడు. తాను ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్‌ తో సినిమా చేస్తాను అంటున్నాడు. అంతే కాదు పవర్ స్టార్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందట. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే..వెంటనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి నుంచి మెహర్ రమేష్‌కి పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. కానీ అవన్నీ పెద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. మరి ఇప్పుడు ఏ హీరో మెహెర్ రమేష్ కి అవకాశం ఇస్తారో చూడాలి. పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే..మెహర్ ఈసారి అయినా హిట్ ఇవ్వగలరా చూడాలి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ
Bigg Boss 9 Winner Prize Money : టైటిల్ విన్నర్ కు షాకింగ్ రెమ్యునరేషన్ తో పాటు, భారీగా బెనిఫిట్స్ కూడా, ఏమిస్తారంటే?