#RSubbalakshmi: ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, సీనియర్ నటి ఆర్ సుబ్బలక్ష్మి కన్నుమూత

Published : Dec 01, 2023, 11:25 AM ISTUpdated : Dec 01, 2023, 11:38 AM IST
#RSubbalakshmi: ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, సీనియర్ నటి ఆర్  సుబ్బలక్ష్మి కన్నుమూత

సారాంశం

వరుస విషాదాలు ఫిల్మ్ ఇండస్ట్రీని వెంటాడుతున్నాయి. ఈ ఏడాది వరుసగా సీనియర్ తారలను ఫిల్మ్ ఇండస్ట్రీ కోల్పోయింది. దక్షణాది సినీతార ఆర్ సుబ్బలక్ష్మి కన్నుమూశారు. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది.  తెలుగు, తమిళ, మలయాళంతోపాటు బాలీవుడ్‌లో కూడా నటించిమెప్పించి,తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సీనియర్ నటి ఆర్.సుబ్బలక్ష్మి కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె  కేరళలోని కొచ్చిలో  ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటు కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. సీనియర్ నటి  మృతిని ఆమె  మనవరాలు సౌభాగ్య వెంకటేశ్ ధృవీకరించారు.  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు.  సుబ్బలక్ష్మి మరణవార్త విని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. 

సుబ్బలక్ష్మి మరణంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్ కు గురయ్యింది. ఆమె దాదాపు 75 సినిమాల్లో నటించారు. తమిళంలో విజయ్ నటించిన బీస్ట్ సుబ్బలక్ష్మికి చివరిసినిమా.. ఇకతెలుగులో  అక్కినేని నాగచైతన్య నటించిన ఏమాయ చేశావే సినిమాలో కూడా  సుబ్బలక్ష్మి  నటించారు. ఇక పలు  సీరియళ్లలోనూ నటించి మెప్పించిన ఆమె.. కొన్ని కమర్షియల్ యాడ్స్ లో కూడా మెరిశారు. ఆమె ఓపిక ఉన్నంత వరకూ టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. వయస్సు మీద పడటంతో... కొంత కాలంగా కొచ్చిలో తన మనవరాలు వద్ద ఉంటోంది.  

 

కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధడుతూ వచ్చింది సుబ్బలక్ష్మి. పరిస్థితి విషమించడంతో గురువారం తుది స్వాసవిడిచారు సుబ్బలక్ష్మి.  ఇక ఆమె చిత్ర పరిశ్రమలోకి రాకముందు జవహర్ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. ఆల్ ఇండియా రేడియోలోనూ సేవలందించారు. రేడియోలో దక్షిణాది నుంచి వచ్చిన తొలి మహిళా కంపోజర్‌గా రికార్డులకెక్కారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌నూ సుబ్బలక్ష్మి పనిచేశారు.

ఇక సుబ్బలక్ష్మి మరణంపై  ఫిల్మ్ ఇండస్ట్రీకి సబంధించిన ప్రముఖులు  సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన మనవరాలు సౌభాగ్య వెంకటేష్.. 30 ఏళ్లుగా  నా బలం .. నా ప్రేమ..  నా సుబ్బు..  మా బేబీ.. మా అమ్మమ్మనునేను కోల్పోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు. సౌభాగ్య మలయాళ పరిశ్రమలో నటిగా కొనసాగుతున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

విజేతని డిసైడ్ చేసే ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్, ఇమ్ము కథ ముగిసినట్లేనా.. కళ్యాణ్, తనూజ లలో ఎవరు ముందంజ ?
Karthika Deepam 2 Today Episode: జ్యో, పారులకు దీప వార్నింగ్- వణికిపోయిన పారు- జ్యో ట్రాప్ లో కాశీ