ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను అని తెలుస్తోంది. వచ్చే నెల నుండి అనసూయ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వనుంది.
అటు బుల్లితెరపైన ఇటు వెండితెరపైన ఓ వెలుగు వెలుగుతున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆమె క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. 36 ఏళ్ల వయసులో కూడా వన్నెతరగని అందాలతో వెండితెరను వేడిక్కిస్తోంది. ఆమె ఫొటోలు ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. తన గ్లామర్ తో కుర్రాళ్లను మనస్సుని దోచేసే ఆమె సినిమాల్లో ఎంచుకుంటున్న పాత్రలు కూడా ఓ రేంజిలో ఉంటున్నాయి.
ఆ మధ్య ఆమె నటించిన ‘రంగస్థలం’ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అందులో ‘రంగమ్మత్త’గా అనసూయ తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. అదే విధంగా ఇప్పుడు ఆమె ఇప్పుడు మరో సినిమా చెయ్యబోతోందని వినికిడి. మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇదొక ఆంథాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే సినిమా. ఆరు కథల సమ్మేళనమే ఈ సినిమా. గతంలో ‘పేపర్ బాయ్’, ‘విటమిన్ షి’ వంటి సినిమాలు డైరక్ట్ చేసిన జయశంకర్ ఈ సినిమాకు డైరక్టర్. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను అని తెలుస్తోంది. వచ్చే నెల నుండి అనసూయ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవ్వనుంది.
అలాగే ఈ చిత్రంలో ఆమె ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుందని సమాచారం. మొత్తం ఆరు కథల్లో అనసూయ పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా ఈ రోల్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇక ఆమె కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అనసూయ 'పుష్ప' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. 'రంగమ్మత్త' స్థాయిలో ఈ పాత్ర కూడా తనకి మంచి గుర్తింపును తీసుకొస్తుందని ఆమె భావిస్తోంది. ఇన్నాళ్లూ సినిమాల పరంగా ప్రత్యేకమైన పాత్రలలో కనిపించడానికీ, స్పెషల్ సాంగ్స్ లో మెరవడానికి ప్రాధాన్యతను ఇస్తూ వెళ్లింది. ఇక ఈ మధ్య మాత్రం ముఖ్యమైన పాత్రలు చేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతోంది. ఇటీవల ఆమె ఒప్పుకున్న సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.