
పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టి ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు శిల్పాకి కూడా చిక్కులు తెచ్చిపెట్టింది. రాజ్ కుంద్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఫారెన్ యాప్స్ ద్వారా రాజ్ కుంద్రా పోర్న్ కంటెంట్ తో చిత్రాలు నిర్మిస్తున్నాడు అంటూ ముంబై పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
పలువురు నటీమణులని ఇందులోకి బలవంతంగా తీసుకువచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజ్ కుంద్రా ఆఫీస్ ని రైడ్ చేసిన పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. ఈ మొత్తం వ్యవహారంతో శిల్పా శెట్టి ఫ్యామిలీ మీడియాలో నిలిచింది. ఆమె భర్త వ్యవహారం పరువు సమస్యగా మారింది. దీనితో మానసిక ప్రశాంతత కోల్పోయిన శిల్పా శెట్టి భర్తతో గొడవపడినట్లు వార్తలు వచ్చాయి.
అయితే పైకి మాత్రం తాను షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్ల తన భర్త ఏం చేస్తున్నాడో తెలియదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. కానీ ఆమె ఫ్యామిలీలో పరిస్థితి మాత్రం బాగాలేదని టాక్. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి విడిపోతున్నట్లు కూడా ఊహాగానాలు వినిపించాయి.
తాజాగా శిల్పా శెట్టి సోషల్ మీడియా పోస్ట్ ఆ అనుమానాల్ని బలపరుస్తోంది. తన పోస్ట్ కు న్యూ ఎండింగ్స్ అనే హెడ్ లైన్ పెట్టింది. 'కాలంలో వెనక్కి వెళ్లి జీవితాన్ని కొత్తగా ప్రారంభించే అవకాశం ఉండదు. కానీ మన ప్రయాణాన్ని ముగించవచ్చు' అని అర్థం వచ్చేలా శిల్పా శెట్టి పోస్ట్ చేసింది. ప్రయాణాన్ని ముగించవచ్చు అంటే రాజ్ కుంద్రాతోనేనా అనే ఊహాగానాలు బిటౌన్ లో జోరందుకున్నాయి.