అందరి చూపు కొరటాల పైనే.. తొలిసారి పాన్ ఇండియా చిత్రం, మాటిచ్చేశాడు

Published : Mar 23, 2023, 01:52 PM IST
అందరి చూపు కొరటాల పైనే.. తొలిసారి పాన్ ఇండియా చిత్రం, మాటిచ్చేశాడు

సారాంశం

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. 

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా డైరెక్టర్లు అతిథులుగా హాజరయ్యారు. 

ఆర్ఆర్ఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. దీనితో ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఏ రేంజ్ లో ఉంటుంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఎన్టీఆర్ కొరటాల శివకి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. 

కొరటాల శివ తొలిసారి పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. పైగా ఆచార్య లాంటి పరాజయం తర్వాత ఎన్టీఆర్ 30 ప్రారంభం అయింది. దీనితో ఎన్టీఆర్ 30 విషయంలో అందిరి చూపు కొరటాల పైనే పడింది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ చేస్తున్న చిత్రంపై భారీ అంచనాలు ఇండియా వ్యాప్తంగా ఉంటాయి. ఆ అంచనాలని కొరటాల ఎలా అందుకుంటారు ? ఎలాంటి కథ సిద్ధం చేసుకున్నారు ? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి. 

లోకల్ గా కొరటాల శివ తిరుగులేని దర్శకుడు. తెలుగు ఆడియన్స్ అభిరుచుకి తగ్గట్లుగా కమర్షియల్ చిత్రాలు తెరకెక్కించడం లో దిట్ట. అందులో సందేహం లేదు.  ఇప్పుడంటే రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు తమ దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమాని పాన్ ఇండియా వ్యాప్తం చేశారు. కానీ మన తెలుగు కమర్షియల్ కథలకు పాన్ ఇండియా స్థాయిలో అప్పీల్ ఉందా అంటే అనుమానమే. వైవిధ్యం ఉంటేనే ఆడతాయి. 

ఈ నేపథ్యంలో కొరటాల ఎన్టీఆర్ 30 స్టోరీ లైన్ రివీల్ చేశారు. ఇండియాలో గుర్తింపుకి నోచుకోని ఓ తీరప్రాంతం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉంటుంది. అక్కడ మృగాల్లా సంచరించే రాక్షసులు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి భయం లేదు. వాళ్ళు భయపడేది ఒక్కరికే. అది ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని కొరటాల శివ అన్నారు. ఈ స్టోరీ లైన్ వింటుంటే.. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ అనిపిస్తుంది. ఒక ప్రాంతంలో జనాభాని బానిసలుగా చూసే విలన్.. అక్కడికి హీరో వెళ్లడం, తిరుగుబాటు చేయడం లాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. 

స్టోరీ లైన్ ఇదే అయినప్పటి కొరటాల ఈ చిత్రాన్ని ఎంత భారీగా తెరకెక్కించబోతున్నారు.. ఇన్నర్ ప్లాట్ లో ఎలాంటి వైవిధ్యం చూపించబోతున్నాడు అనేదే కీలకం కానుంది. తన కెరీర్ లో ఈ చిత్రం ది బెస్ట్ మూవీ అవుతుంది అని కొరటాల ఎన్టీఆర్ 30 లాంచ్ కార్యక్రమాలో మాటిచ్చారు. సో కొరటాల ఈ కథపై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ చిత్రానికి అనిరుధ్, రత్నవేలు, సాబు సిరిల్ లాంటి గొప్ప టెక్నీషియన్స్ ని కొరటాల ఎంపిక చేసుకున్నారు. మొత్తంగా కొరటాల మాట ఇవ్వడంతో నందమూరి ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?
Savitri: మహానటి జీవితం నాశనం కావడానికి జెమినీ గణేషన్‌, పొలిటీషియన్‌ మాత్రమే కాదు, ఆ మూడో వ్యక్తి ఇతడేనా?