రాముడి పూజలో `సీత`..`ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఆలియా ప్రీ లుక్‌

Published : Mar 14, 2021, 09:59 PM IST
రాముడి పూజలో `సీత`..`ఆర్‌ఆర్‌ఆర్‌`లో ఆలియా ప్రీ లుక్‌

సారాంశం

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో బాలీవుడ్‌ నటి అలియా భట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేపు(సోమవారం-మార్చి 15) అలియా భట్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని లుక్‌ని విడుదల చేయబోతున్నారు. 

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇందులో బాలీవుడ్‌ నటి అలియా భట్‌, బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేపు(సోమవారం-మార్చి 15) అలియా భట్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ఉదయం 11గంటలకు అలియా భట్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనున్నారు. 

అలియా భట్‌ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌కి జోడిగా సీత పాత్రలో నటిస్తుంది. సీతగా ఆమె ఎలా ఉండబోతుందో చూపించబోతున్నారు. అలియా భట్‌కిది స్పెషల్‌ గిఫ్ట్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. దీంతో ఆమె ఫస్ట్ లుక్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ లుక్‌ని విడుదల చేసింది యూనిట్‌. ఇందులో శ్రీముడి విగ్రహానికి అలియా పూజా చేస్తున్నట్టుగా ఉంది. షేడ్‌లో ఉన్న ఈ ఫోటోలు ఫస్ట్ లుక్‌ని ప్రతిబింబిస్తుంది. ఆనాటి డ్రెస్సింగ్‌లో అలియా కనిపించనున్నట్టు తెలుస్తుంది. 

అలియా భట్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆమెతోపాటు అజయ్‌ దేవగన్‌,సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ యాక్షన్‌ ఎపిసోడ్స్   షూటింగ్‌ జరుపుకోబోతుంది. దీంతోపాటు రామ్‌చరణ్‌, అలియాభట్‌లపై ఓ రొమాంటిక్‌ సాంగ్‌ ఉండబోతుంది. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 13న సినిమాని విడుదల చేయబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?