సాయిపల్లవి `సారంగ దరియా` సంచలనం.. రేర్‌ మైల్‌ స్టోన్‌..

Published : Mar 14, 2021, 09:29 PM ISTUpdated : Mar 14, 2021, 09:30 PM IST
సాయిపల్లవి `సారంగ దరియా` సంచలనం..  రేర్‌ మైల్‌ స్టోన్‌..

సారాంశం

`లవ్‌స్టోరి` చిత్రంలోని `సారంగ దరియా` పాట ఎంతగా అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇది రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందే ఈ పాట సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. తాజాగా ఇది అరుదైన మైల్‌స్టోన్‌కి చేరుకుంది. 

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన `లవ్‌స్టోరి` చిత్రంలోని `సారంగ దరియా` పాట ఎంతగా అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇది రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందే ఈ పాట సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. తాజాగా ఇది అరుదైన మైల్‌స్టోన్‌కి చేరుకుంది. పాట విడుదలైన రెండు రోజుల్లోనే 50 మిలియన్స్ కిపైగా వ్యూస్‌ని సాధించింది. ఫిబ్రవరి 28న సమంత చేతుల మీదుగా విడుదలైన ఈ పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్ చేరుకుందని చిత్ర బృందం తెలిపింది. 

సాయి పల్లవి చేసిన పాట `రౌడీ బేబీ` 8 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుని మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత `సారంగ దరియా` నిలిచిందన్నారు. అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్స్ `బుట్ట బొమ్మ`, `రాములో రాములా` పాటలు `సారంగ దరియా` స్పీడ్ కంటే వెనకబడ్డాయి. `బుట్ట బొమ్మ` పాటకు 50 మిలియన్ వ్యూస్ వచ్చేందుకు 18 రోజులు పట్టగా, `రాములో రాములా` పాటకు 27 రోజులు పట్టిందన్నారు. 

సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించిన `సారంగ దరియా` పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ సినిమాలో ఆడియెన్స్ తో స్టెప్పులు వేయించనుంది. పవన్ సీహెచ్ సంగీతం ఈ తెలంగాణ జానపద గీతానికి అద్భుతంగా కుదిరింది. మంగ్లీ గొంతులో పలికిన మరో సూపర్ హిట్ సాంగ్ సారంగ దరియా. ఇన్ని స్పెషాలిటీస్ తో ఏప్రిల్ 16న `లవ్ స్టోరి` సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్