స్టేజ్ పై హీరోకి 'ఐలవ్యూ' చెప్పిన 'RRR' బ్యూటీ!

Published : Mar 24, 2019, 03:35 PM IST
స్టేజ్ పై హీరోకి 'ఐలవ్యూ' చెప్పిన 'RRR' బ్యూటీ!

సారాంశం

నటి అలియాభట్, రణబీర్ కపూర్ లు ప్రేమలో ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన ప్రేమను అందరి ముందు వ్యక్తపరిచింది అలియా. 

నటి అలియాభట్, రణబీర్ కపూర్ లు ప్రేమలో ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా తన ప్రేమను అందరి ముందు వ్యక్తపరిచింది అలియా. 'రాజీ' సినిమాకు గాను అలియాకి ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది.

ఈ సందర్భంగా స్టేజ్ పైకి వెళ్లిన అలియా ఆమెకి అవార్డు రావడానికి కారణమైన వారికి థాంక్స్ చెబుతూ.. తన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తి రణబీర్ అని చెబుతూ.. అతడికి 'ఐలవ్యూ' చెప్పింది. ఆమె అలా చెప్పడంతో రణబీర్ కాస్త సిగ్గు పడుతూ ముఖానికి చేయి అడ్డుపెట్టుకొని మురిసిపోయాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ జంటని చూసిన నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఇటీవల అలియా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో 'బ్రహ్మాస్త్ర'తో పాటు మరి కొన్ని సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే 'RRR' సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. 

 

PREV
click me!

Recommended Stories

BMW Movie Collections: రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` 14 రోజుల బాక్సాఫీసు వసూళ్లు.. మరో డిజాస్టర్‌
Arijit Singh: స్టార్‌ సింగర్‌ అరిజిత్‌ సింగ్‌ సంచలన ప్రకటన.. ఇకపై పాటలకు గుడ్‌ బై.. కానీ ట్విస్ట్ ఏంటంటే