సుకుమార్‌ మద్దతు కోసం ఇంటికెళ్లిన రెండు పార్టీలు!

Published : Mar 24, 2019, 03:18 PM IST
సుకుమార్‌ మద్దతు కోసం ఇంటికెళ్లిన  రెండు పార్టీలు!

సారాంశం

గ్రామరాజకీయాల నేపధ్యంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో సుకుమార్ క్రేజ్ రెట్టింపు అయ్యింది. అయితే ఇప్పుడా సుకుమార్‌కు కూడా రాజకీయ వేడి తగులుతోంది. 

గ్రామరాజకీయాల నేపధ్యంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో సుకుమార్ క్రేజ్ రెట్టింపు అయ్యింది. అయితే ఇప్పుడా సుకుమార్‌కు కూడా రాజకీయ వేడి తగులుతోంది. సుకుమార్ స్వస్థలమైన తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు గ్రామం రాజోలు నియోజవర్గం పరిధిలోకి వస్తుంది.  త్వరలో ఎలక్షన్స్  జరగనున్న నేపధ్యంలో ఆయన్ను తమ పార్టీ కోసం మద్దతు ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయం దగ్గరపడింది. అన్ని పార్టీలు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నాయి.  మాడ్చేస్తున్న  ఎండలను సైతం లెక్కచేయకుండా పార్టీ అభ్యర్దులు  గ్రామగ్రామాన ప్రచారం చేస్తున్నారు.  తమ పార్టీకే ఓటేసి గెలిపించాలని అందరినీ కోరుతున్నారు. ముఖ్యంగా తమ నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులను టచ్ చేస్తున్నారు. 

ప్రజలతో పాటు ఆ  ప్రముఖులను సైతం కలుస్తూ తమ పార్టీకి మద్దతు తెలపాలని కోరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్‌ను తెలుగు దేశం పార్టి, జనసేన అభ్యర్థులు కలిశారు.   సుకుమార్ ప్రస్తుతం తన స్వగ్రామంలోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు ఆయన ఇంటికి వెళ్లి మద్దతివ్వాలని కోరుతుకున్నారు. 

తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో మట్టపర్రులో తెదేపా తరఫున పోటీచేస్తున్న గొల్లపల్లి సూర్యారావు, జనసేన తరఫున పోటీ చేస్తున్న రాపాక వరప్రసాద రావు ఆయననను వేర్వేరుగా కలిశారు. తమ పార్టీకి మద్దతు పలకాలని కోరారు.  తమ పార్టీకి మద్దతిచ్చి ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల రాకతో సుకుమార్ నివాసం సందడిగా మారింది. త్వరలో వైయస్పార్పీ పార్టీ అభ్యర్ది కూడా వస్తారని అంతా భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

BMW Movie Collections: రవితేజ `భర్త మహాశయులకు విజ్ఞప్తి` 14 రోజుల బాక్సాఫీసు వసూళ్లు.. మరో డిజాస్టర్‌
Arijit Singh: స్టార్‌ సింగర్‌ అరిజిత్‌ సింగ్‌ సంచలన ప్రకటన.. ఇకపై పాటలకు గుడ్‌ బై.. కానీ ట్విస్ట్ ఏంటంటే