NTR 30: ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంపై క్లారిటీ ఇచ్చిన అలియా భట్‌..

Published : Feb 03, 2022, 10:39 PM IST
NTR 30: ఎన్టీఆర్‌-కొరటాల చిత్రంపై క్లారిటీ ఇచ్చిన అలియా భట్‌..

సారాంశం

ఎన్టీఆర్‌ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో `ఎన్టీఆర్‌30` చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అలియాభట్‌ని తీసుకుంటున్నారని, ఈ విషయంపై అలియాతో చర్చలు జరపగా ఆమె ఓకే చెప్పిందని ఇటీవల ఓ వార్త వైరల్‌ అయ్యింది.

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌(Alia Bhatt).. తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Movie) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్‌(Ram Charan)కి జోడీగా నటిస్తుంది. ఆమె పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని అలరించబోతున్న అలియా భట్‌.. మరో తెలుగు సినిమా చేస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆమె ఎన్టీఆర్‌తో జోడీ కడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. 

ఎన్టీఆర్‌(NTR) ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో `ఎన్టీఆర్‌30`(NTR 30) చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అలియాభట్‌ని తీసుకుంటున్నారని, ఈ విషయంపై Aliaతో చర్చలు జరపగా ఆమె ఓకే చెప్పిందని ఇటీవల ఓ వార్త వైరల్‌ అయ్యింది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా అలియాభట్‌ స్పందించింది. `ఎన్టీఆర్‌-కొరటాల` చిత్రంపై క్లారిటీ ఇచ్చింది. ఇందులో తాను నటిస్తున్నట్టు స్పష్టం చేసింది. 

ప్రస్తుతం బాలీవుడ్‌లో అలియాభట్‌ `గంగూబాయిః కథియవాడి` చిత్రంలో నటిస్తుంది. సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ రేపు(శుక్రవారం) విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో గురువారం ముంబయిలో ఓ మీడియా మీట్‌లో అలియాభట్‌ స్పందించింది. తెలుగులో చేస్తున్న ఎన్టీఆర్‌ 30 చిత్రంపై ఆమె క్లారిటీ ఇచ్చింది. `కొరటాల శివ వచ్చి స్టోరీ నరేట్‌ చేశారు. మరో ఆలోచన చేయలేదు. ఆయన నరేషన్‌ పూర్తి చేసిన వెంటనే సినిమా చేసేందుకు ఓకే చెప్పాను. `ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత తారక్‌తో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా` అని తెలిపింది అలియాభట్‌. 

ఇక ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అలియాభట్‌, ఒలీవియా మోర్రీస్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా కలిసి నటించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రం మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దానయ్య ఏకంగా ఐదు వందల కోట్లతో నిర్మించారు. ఈ సినిమా పదికిపైగా భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇక అలియాభట్‌ ఈ చిత్రంతోపాటు హిందీలో `గంగూబాయి`, అలాగే `బ్రహ్మాస్త్ర`, `డార్లింగ్స్`, `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ` చిత్రాల్లో నటిస్తుంది. అంతేకాదు నిర్మాతగా మారి `డార్లింగ్స్` చిత్రాన్ని నిర్మిస్తుంది కూడా. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్
Venkatesh కోసం హీరోయిన్‌ ని సెట్‌ చేసిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఐశ్వర్యా రాయ్‌కి పెద్ద షాక్‌