
అలియాభట్(Alia Bhatt) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) చిత్రంలో నటించింది. అలియా సౌత్‌లోకి ఇది పర్‌ఫెక్ట్ ఎంట్రీగా చెప్పొచ్చు. గత డిసెంబర్‌లో `ఆర్‌ఆర్‌ఆర్` ప్రమోషన్‌లో పాల్గొన్న అలియా.. ఈ సారి మాత్రం టైమ్ ఇవ్వలేకపోయింది. బాలీవుడ్ ప్రాజెక్ట్ ల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆమె ప్రమోషన్‌లో పాల్గొనలేకపోయింది. కేవలం ఢిల్లీ ఈవెంట్‌లో మాత్రమే సందడి చేసింది.
అయితే వారణాసి లో తన వంతు `ఆర్‌ఆర్‌ఆర్` ని ప్రమోట్ చేసింది అలియా. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. అలియాభట్, ప్రియుడు రణ్‌బీర్ కపూర్ కలిసి `బ్రహ్మాస్త్ర` చిత్రంలో నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మొదటి చిత్రమిది. ఈ సినిమా షూటింగ్ వారణాసిలో జరుగుతుంది. అయితే ఇటీవల `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్ వారణాసిలో హల్‌చల్ చేసింది. ఎన్టీఆర్(NTR), చరణ్(Ram Charan), రాజమౌళి(Rajamouli) గోల్డెన్ టెంపుల్‌ని సందర్శించారు. అక్కడ పూజలు నిర్వహించారు. దీంతో `ఆర్‌ఆర్‌ఆర్` ఫ్యాన్స్ సైతం అక్కడ హల్‌చల్ చేశారు.
ఈ క్రమంలో షూటింగ్‌లో భాగంగా నదిలో `బ్రహ్మాస్త్ర` టీమ్‌తో కలిసి అలియా, రణ్‌బీర్ పడవలో ప్రయాణిస్తున్నారు. వీరిని చూసిన అభిమానులు `ఆర్‌ఆర్‌ఆర్` అంటూ, `అలియా` అంటూ అరవడం స్టార్ట్ చేశారు. ఇది గమనించిన అలియా సైతం రియాక్ట్ అయ్యింది. రణ్‌బీర్ ముందే `ఆర్‌ఆర్‌ఆర్` అంటూ గట్టిగా అరిచింది, కాసేపు అరుపులు, కేకలతో రచ్చ చేసింది. ఈ సందర్భంగా అలియా అరుపులను అభిమానులు కెమెరాల్లో బందించి ఆ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలు వైరల్‌గా మారాయి.
ఎన్టీఆర్, చరణ్ హీరోలుగా నటించిన `ఆర్‌ఆర్‌ఆర్`లో చరణ్‌కి జోడీగా అలియా కనిపించనున్నారు. ఆమె సీత పాత్రని పోషిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్‌కి జోడీగా బ్రిటీష్ నటి ఒలివీయా మోర్రీస్ కనిపిస్తారని సమాచారం. డివివి దానయ్య నిర్మించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో అజయ్ దేవగన్, శ్రియా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 25న(శుక్రవారం) విడుదల కానుంది. దీంతో యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది.
మరోవైపు అలియాభట్ `ఆర్‌ఆర్‌ఆర్`తోపాటు మరో తెలుగు సినిమాలో నటిస్తుంది. ఎన్టీఆర్‌కి జోడీగా కొరటాల శివ చిత్రంలో హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతోపాటు హిందీలో `బ్రహ్మాస్త్ర`తోపాటు `రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ`, `డార్లింగ్స్`, `జీ లే జరా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.