డీప్‌ ఫేక్‌ వీడియోకి మరో స్టార్‌ హీరోయిన్‌ బలి.. అలియా భట్‌ని టార్గెట్‌ చేసిన కేటుగాళ్లు.. హాట్‌ టాపిక్

Published : Nov 27, 2023, 11:45 AM IST
డీప్‌ ఫేక్‌ వీడియోకి మరో స్టార్‌ హీరోయిన్‌ బలి.. అలియా భట్‌ని టార్గెట్‌ చేసిన కేటుగాళ్లు.. హాట్‌ టాపిక్

సారాంశం

డీప్‌ ఫేక్‌ వీడియోలు, ఏఐ టెక్నాలజీ ఇప్పుడు సోషల్‌ మీడియాని కుదిపేస్తుంది. స్టార్లకి అది పెద్ద శాపంలా మారుతుంది. రష్మిక దీని బారిన పడింది.ఇప్పుడు అలియా భట్‌ వంతు వచ్చింది. 

`ఏఐ`(ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్సీ) టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో, అంతకంటే ఎక్కువగా దుర్వినియోగం అవుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది. వారి ఫేస్‌లను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్‌ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా దీనికి బలయ్యింది. ఆమె కోసం దేశం మొత్తం నిలబడింది. 

ఆ తర్వాత కత్రినా కైఫ్‌, సారా టెండుల్కర్‌, కాజోల్‌ ఫోటోలు, వీడియోలను సైతం ఇలానే మార్ఫింగ్‌ చేశారు. డీప్‌ ఫేక్‌ ఫోటోలతో రచ్చ చేశారు. తాజాగా ఇప్పుడు అలియాభట్‌ని టార్గెట్‌ చేశారు. ఓ లేడీకి అలియాభట్‌ ఫేస్‌ని యాడ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదలగా అది దుమారం రేపుతుంది. ఇందులో బ్లూ ఫ్లోరల్‌ ధరించిన లేడీ చాలా బోల్డ్ గా కూర్చొని ఉంది. ఆమె ఫేస్‌కి అలియా భట్‌ ఫేస్‌ యాడ్‌ చేయగా అది ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్ అవుతుంది. దీనిపై ఆమె అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. వారిని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏఐ కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

అలియాభట్‌.. ప్రస్తుతం `జిగ్రా` అనే మూవీలో నటిస్తుంది. దీనికి ఆమె కూడా నిర్మాత కావడం విశేషం. ఇక రణ్‌బీర్‌ని కపూర్‌ని పెళ్లి చేసుకున్న అలియాభట్‌.. ఆ మధ్యనే కూతురుకి జన్మనిచ్చింది. కొన్ని రోజులు మాతృత్వాన్ని ఆస్వాధించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతుంది. ఆమె వరుసగా కమిట్‌ అవుతూ కెరీర్‌కి మాతృత్వం అడ్డు కాదని నిరూపిస్తుంది. పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్‌గా రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంది. 

అలియాభట్‌.. ఇటీవల `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ కహాణి` చిత్రంలో నటించింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతోపాటు హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `హార్ట్ ఆఫ్‌స్టోన్‌` చిత్రంలో మెరిసింది. ఇది కూడా ఆమెకి పెద్దగా పేరుని తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం `జిగ్రా` మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇదిలా ఉంటే గతేడాది ఈ బ్యూటీ `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంతో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్