Adikeshava Movie Collections : ఆదికేశవ చిత్రానికి షాకింగ్ వసూళ్లు... మూడు రోజుల్లో వచ్చింది ఇంతే!

Published : Nov 27, 2023, 11:05 AM IST
Adikeshava Movie Collections : ఆదికేశవ చిత్రానికి షాకింగ్ వసూళ్లు... మూడు రోజుల్లో వచ్చింది ఇంతే!

సారాంశం

 ఫస్ట్ షో నుండి ఆదికేశవ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. ఆదివారం కూడా ఆదికేశవ బాక్సాఫీస్ వద్ద పుంజుకోలేదు. 


మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి షాక్ మీద షాక్ తగులుతుంది. వరుసగా ఆయనకు హ్యాట్రిక్ ప్లాప్ పడినట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆదికేశవ డిజాస్టర్ దిశగా వెళుతుంది. దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఆదికేశవ చిత్రం తెరకెక్కించారు. వైష్ణవ్ తేజ్ కి జంటగా శ్రీలీల నటించింది. లవ్, రొమాన్స్ తో పాటు యాక్షన్, వైలెన్స్ మేళవించి ఆదికేశవ తెరకెక్కింది. వైష్ణవ్ కెరీర్ లో మొదటిసారి మాస్ ఇమేజ్ కోసం వైష్ణవ్ ట్రై చేశాడు 

నవంబర్ 24న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఫస్ట్ షో నుండి ఆదికేశవ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో వసూళ్లు ఏమంత ఆశాజనకంగా లేవు. ఆదివారం కూడా ఆదికేశవ బాక్సాఫీస్ వద్ద పుంజుకోలేదు. ఆదికేశవ మూడు రోజుల వసూళ్లు పరిశీలిస్తే... ఏపీ/తెలంగాణాలలో రూ. 1.3 కోట్ల షేర్, రూ. 2.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక వరల్డ్ వైడ్ మూడు రోజులకు రూ. 1.6 కోట్ల షేర్, రూ. 3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

ఆదికేశవ వరల్డ్ వైడ్ రూ. 8.5 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే రూ. 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది. ఇప్పటికి కనీసం రూ. 2 కోట్ల షేర్ కూడా రాలేదు. వైష్ణవ్ తేజ్ కెరీర్లో ఇది ఎపిక్ డిజాస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. వైష్ణవ్ తేజ్ గత రెండు చిత్రాలు కొండపొలం, రంగ రంగ వైభవంగా సైతం నిరాశపరిచాయి. ఆదికేశవ చిత్రంతో ఆయన హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేశాడు. మరోవైపు శ్రీలీలకు కూడా గట్టిదెబ్బ పడింది. 
 

PREV
click me!

Recommended Stories

Chiru-Charan: టాలీవుడ్‌లో అరుదైన రికార్డులు సెట్‌ చేసిన చిరంజీవి, రామ్‌ చరణ్‌.. పవన్‌, అల్లు అర్జున్‌ కూడా తర్వాతే
Ustaad Bhagat Singh Business: పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కలెక్షన్ల టార్గెట్‌.. `ఓజీ` జోరు మిస్‌ అయ్యిందా?