రణబీర్ తో పెళ్లిపై అలియా రెస్పాన్స్!

By Udaya DFirst Published Feb 7, 2019, 1:27 PM IST
Highlights

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణబీర్ లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అలియా తన లైఫ్ లో చాలా స్పెషల్ పెర్సన్ అని రణబీర్ చాలా సార్లు చెప్పాడు. 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణబీర్ లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అలియా తన లైఫ్ లో చాలా స్పెషల్ పెర్సన్ అని రణబీర్ చాలా సార్లు చెప్పాడు. అలియా తండ్రి, నిర్మాత మహేష్ భట్ తన కూతురు రణబీర్ ని ప్రేమిస్తుందని గతంలో మీడియా ముఖంగా వెల్లడించాడు.

ఇక అప్పటినుండి బాలీవుడ్ లో వీరి ప్రేమ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మీడియా ముందుకొచ్చిన అలియాకి రణబీర్ కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

రణబీర్ తో పెళ్లెప్పుడు అని విలేకరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా.. ''గతేడాదిలో రెండు అందమైన వివాహ వేడుకలు(ప్రియాంక చోప్రా, దీపిక పడుకొన్ ల పెళ్లిళ్లు) చూశాం కదా.. కాబట్టి కొంతకాలం ఈ పెళ్లి వార్తల నుండి విరామం తీసుకోండి.  ఇప్పటికైతే సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయండి'' అంటూ అసలు విషయం చెప్పకుండా తప్పించుకుంది.

ప్రస్తుతం అలియా, రణబీర్ లు జంటగా 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అమితాబ్, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించారు. 
 

click me!