త్రిష ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

Published : Feb 07, 2019, 12:43 PM IST
త్రిష ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

సారాంశం

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదనే చెప్పాలి. అందుకే ఈ మధ్యకాలంలో హీరోయిన్లు లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. అనుష్క, నయనతార వంటి హీరోయిన్లకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ద్వారా వచ్చిన ఇమేజే వేరు. 

ఇప్పుడు త్రిష కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. మధ్యలో 'నాయకి', 'మోహిని' వంటి చిత్రాలు చేసినప్పటికీ అమ్మడుకి కలిసిరాలేదు. ఈసారి మాత్రం లేడీ ఓరియెంటెడ్ కథతో హిట్ కొట్టాలని చూస్తోంది.

ఈ క్రమంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఓ సినిమాకు సైన్ చేసింది. త్రిష బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా దర్శకుడు శరవణన్ ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథ త్రిషకి విపరీతంగా నచ్చడంతో ఆమె వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది.

సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. శరవణన్ గతంలో 'గణేష్', 'జర్నీ' వంటి సినిమాలు రూపొందించాడు. మరి ఈ సినిమాతోనైనా త్రిష సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Naga Chaitanya కంటే ముందే.. అఖిల్ తండ్రి కాబోతున్నాడా? తాత కావడంపై నాగార్జున అక్కినేని రియాక్షన్ ఏంటి?
Chiranjeevi-Balakrishna కాంబో సెట్టింగ్‌.. బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించేలా బడా నిర్మాత భారీ స్కెచ్‌