Gangubai Kathiawadi: ఆలియా భట్ గంగూబాయి కతియావాడి రిలీజ్ డేట్ ఫిక్స్... ఎప్పుడంటే..?

Published : Dec 16, 2021, 04:05 PM IST
Gangubai Kathiawadi: ఆలియా భట్ గంగూబాయి కతియావాడి రిలీజ్ డేట్ ఫిక్స్... ఎప్పుడంటే..?

సారాంశం

 ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్న ముంబాయి బేస్డ్ రియల్ స్టోరీ.. గంగూబాయ్ కతియావాడి. గతంలో రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ మూవీ తాజా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.   

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్(Alia Bhat) లీడ్ రోల్ చేసిని సినిమా “గంగూబాయి కతియావాడి”(Gangubai Kathiawadi ). బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రాసిన “మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై” అనే బుక్ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాను  సంజయ్‌ లీలా భన్సాలీ,జ‌యంతిలాల్‌గ‌డ సంయుక్తంగా నిర్మించారు. ‌బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్న ఈ సినిమాలో ఆలియా భట్ గంగూబాయిగా వేశ్య గృహం నడిపే యజమానిగా నటించింది. 


బాలీవుడ్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. 2022 పిబ్రవరి 18న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఈ సినిమా అసలు 2022 జనవరి 6న రిలీజ్ కావల్సి ఉంది. గతంలో ఈ డేట్ నే ప్రకటించారు కూడా. కాని జనవరి 7న ట్రిపుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండటంతో.. గంగూబాయ్ టీమ్ రిలీజ్ డేట్ ను మార్కుకోక తప్పలేదు. అయితే ఆలియా భట్ ట్రిపుల్ ఆర్ లో రామ్ చరణ్ జోడీగా నటించింది. 


ట్రిపుల్ ఆర్ తో పోటీ పడుకుండా.. రెండు సినిమాల మధ్య క్లాష్ లేకుండా సేఫ్ జోన్ చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది గంగూబాయి. ఈ సినిమా రిలయ్ స్టోరీ.. దాదాపు ఓ వేశ్య బయోపిక్ అనుకోవచ్చు. గంగూబాయ్ అండర్‌వరల్డ్‌ సహాయంతో ముంబైలోని కామతిపూరలో పలు వేశ్యాగృహాలు నడిపేది. ఆమెకు ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ అనే పేరు వచ్చింది. తెలిసి తెలియని వయసులో ఓ వ్యక్తిని ఇష్టపడి ..గుడ్డిగా నమ్మి ఇంట్లో నుండి పారిపోయి ముంబయ్ చేరిన గంగూబాయి. వేశ్యగా ఎలా మారింది. అమాయకురాలు కాస్తా అండర్‌వరల్డ్‌ స్తాయికి ఎలా ఎదిగింది అనేది సినిమా.  

Also Read : Allu Arjun-Pushpa: తెలంగాణాలో మోదం... ఆంధ్రాలో ఖేదం, తెలుగు రాష్ట్రాల్లో పుష్ప పరిస్థితి ఇది!


అవ్వడానికి ఆమె వేశ్య అయినా.. కామతిపురలో పేదవారి లైఫ్ స్టైల్ మార్చి.. పేదరికం నుంచి బయటపడటానికి గంగూబాయ్ చాలా కృషి చేసింది. అందుకే అక్కడి ప్రజల్లో గంగూబాయి పట్ల ఓ గౌరవం ఏర్పడింది. ఆమె విగ్రహాలు మరియు ఫోటోలు అక్కడి ని ఇళ్లలో ఇప్పటికీ  కనిపిస్తాయి. ఆ ఏరియాలో ఆమెకు విగ్రహాన్ని కూడా నిర్మించారు. ఆలియా భట్ ఈ పాత్రకోసం చాలా హోమ్ వర్క్ చేసింది. మరి గంగూబాయిగా ఆలియా ఎలా నటించిందో చూడాలి అంటే పిబ్రవరి 18 వరకూ ఆగాల్సిందే. 
 

PREV
click me!

Recommended Stories

Ravi Teja: 12 లక్షలు పెడితే 100 కోట్లకు పైగా లాభం.. రవితేజ ఆస్తులపై సంచలన కామెంట్స్ చేసింది ఎవరో తెలుసా?
Feel Good Movies: మూడ్ బాలేదా? ఈ 5 సినిమాలు చూస్తే మనసు తేలికపడటం ఖాయం